తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Whizzy: ప్రముఖ డెలివరీ పార్ట్ నర్ సంస్థ ‘విజ్జీ’ సంప్రదాయ ఇంధన ద్విచక్ర వాహనాలకు బదులు తమ రైడర్లకు ఎలక్ట్రిక్ బైక్‌లను అందించింది. గచ్చిబౌలిలోని కపిల్ టవర్స్‌లో గల ‘విజ్జీ’ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ రైడర్లకు ఆదివారం ఈవీ బైక్ తాళాలను అందించారు.
అనంతరం జయేష్ రంజన్ జెండా ఊపి ఈ బైక్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేష్ మాట్లాడుతూ ఈవీ వాహనాల విప్లవంలో తెలంగాణ ముందుందని, ప్రభుత్వం ఈవీ వాహనాలకు అనేక రాయితీలను ఇస్తోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, ఈవీ విప్లవంలో ‘విజ్జీ’ భాగమైనందుకు జయేష్ రంజన్ అభినందించారు.
Also Read: Telangana Farmers: తెలంగాణ రైతులకు రాజస్థాన్ లో శిక్షణ.. వీటిపైనే..
ఇదిలా ఉండగా ‘విజ్జీ’ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. జెప్టో, బిగ్ బాస్కెట్, బ్లింక్ ఇట్, ఫ్లిప్‌కార్ట్, అపోలో తదితర సంస్థలకు డెలివరీ పార్ట్ నర్ గా సేవలను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో విజ్జీకి 15 వేల మందికి పైగా రైడర్లు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన గ్రీన్ మొబిలిటీ విజన్‌లో భాగంగా సంస్థ తమ రైడర్లకు ఈవీలను అందించింది.
తొలి దశలో 200 ఈవీ బైక్‌లను అందించింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు, సీఈవో రవిచందర్ రెడ్డి, సహ వ్యవస్థాపకుడు, సీఎస్వో కంకణాల అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Rakul Preet Singh: బ్రేకప్ ఎంతో భయంకరం.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్