తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Telangana Farmers: రాష్ట్రానికి చెందిన రైతులు రాజస్థాన్ కు వెళ్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 54 మంది బృందం వెళ్తుంది. ఏప్రిల్ 1న బయల్దేరి వెళ్లనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని అబుదాబీ తపోవనంలో శాశ్వత యోగ వ్యవసాయం(యోజిక్ అగ్రికల్చర్)పై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
నాలుగురోజులు పాటు ఒక్కో రోజూ ఒక్కో అంశంపై శిక్షణ ఇవ్వనున్నారు. 3వ తేదీన శాంతివన సందర్శనం, లైట్ మూవీ, 4న యోగ వ్యవసాయం- అవసరం, భూమి-నీరు-బీజ సంస్కారం, ఫీల్డ్ సందర్శన- ప్రయోగిక శిక్షణ, వ్యవసాయంలో గౌపాలన మహత్యం, 5న పంట సంరక్షణ, పంట మార్పిడి, సూక్ష్మ పర్యావరణం, వ్యవసాయంలో యోగ మహత్యం, రాజరుషి గ్రామ దత్తక ప్రాజెక్టు, 6న రాజయోగ ధ్యానంపై శిక్షణ ఉంటుంది.
ఈ బృందంలో ఏడీఏ లు వినోద్ కుమార్, శ్యాంసుందర్(రాజేంద్రనగర్), బ్రహ్మకురీస్ నుంచి గైడ్లుగా బ్రహ్మానందరెడ్డి, ప్రభాకర్, రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి 50 మంది రైతులు ఉన్నారు. ఈ నెల 8న తిరిగి రాష్ట్రానికి వస్తారని అధికారులు తెలిపారు.
Also Read: Transgenders Protest: బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి.. కారణం ఎవరంటే?