IPL 2025: గత కొద్దీ రోజుల నుంచి ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉచిత పాస్‌ల ఇంకా ఎక్కువ ఇవ్వాలంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తమను నిత్యం వేధిస్తున్నాడంటూ సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ఆరోపణలు చేసింది. ఇదే మళ్లీ రిపీట్ అయితే హైద్రాబాద్ నుంచి వెళ్లిపోతామని అంటున్నారు. దీని గురించి సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్, హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావుకు లేఖ రాశారు.
Also Read: Hyderabad Metro: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై మెట్రో సేవలు మరింతగా..
ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్‌మోహన్ రావు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలాంటి దురుసు ప్రవర్తనను మేము అస్సలు సహించము. ఇలాగే చేస్తే మేము వేదికను మార్చుకునేందుకు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. వారి ప్రవర్తన ఎలా ఉందంటే.. మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్‌గా చేసుకుని ఆడటం వారికి ఇష్టం లేదనుకుంటా. మనసులో ఏది ఉన్నా.. అయితే లిఖితపూర్వకంగా చెప్పాలని కోరుతున్నాను. ఆ తర్వాత ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వానికి చెబుతాము. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి .. మీరు కోరుకున్న విధంగానే మేము హైదారబాద్ నుంచి వెళ్ళిపోతామని సన్‌రైజర్స్ ప్రతినిథి హెచ్‌సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్‌లో చెప్పారు.
సన్‌రైజర్స్ ( Sunrisers Hyderabad ) జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ ఇంకా ముఖ్యమైన విషయాలను కూడా తన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. గత 12 ఏళ్ళుగా హెచ్‌సీఏతో కలిసి మేము వర్క్ చేస్తున్నాము. 2024 నుంచి మాత్రమే ఈ వేధింపులు మొదలయ్యాయి. ముందుగా మేము మాట్లాడుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతి సీజన్‌లో వారికి 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు ఎక్స్ ట్రా మరో 20 టికెట్లు అడుగుతున్నారు. ఇది మా దృష్టికి వచ్చినప్పుడు చర్చించి పరిష్కరిస్తామని చెప్పిన వారు వినలేదు. హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు.
Also Read: Hyderabad News: ఇదెక్కడి విడ్డూరం.. పర్ఫ్యూమ్ కోసం కాల్పులు.. అసలేం జరిగిందంటే?
SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్‌కు (F3) కు తాళం వేశారు. మేము అడిగిన టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరిచేదే లేదంటూ బెదిరించారు. హెచ్‌సీఏ వాళ్ళు మా సిబ్బందిని బెదిరిస్తూనే ఉన్నారు. అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇక ఏమాత్రం సహించము. మేము కూడా స్టేడియంకు రెంట్ పే చేస్తున్నాము. ఐపీఎల్ సీజన్ సమయంలో స్టేడియం మా ఆధీనంలోనే ఉండాలని శ్రీనాథ్ తన ఈ-మెయిల్‌లో రాసుకొచ్చారు.
హెచ్ సీఏ ఆన్సర్ ఇదే!
ఈ, మొయిల్స్ నకిలీవా, నిజమైనవా? అని అందరూ తెలుసుకోవాలి. ఎస్ఆర్‌హెచ్ నుంచి కూడా మీడియా స్పష్టమైన వివరణ తీసుకోవాలని అన్నారు.
