స్వేచ్ఛ, సినిమా: Vijay Varma: కొద్ది రోజులుగా బాలీవుడ్ ప్రేమ పావురాలు తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని నిజం చేస్తూ వీరిద్దరూ ప్రేమ పాఠాలు చెబుతుండడం అనుమానాలకు తావిస్తున్నది. తాజాగా విజయ్ వర్మ రిలేషన్‌షిప్‌పై చేసిన కామెంట్స్ అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను, ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకునే సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే వాటిని స్వీకరించాలని, రిలేషన్‌షిప్‌ను ఒక ఐస్ క్రీమ్ లా ఆస్వాదించాలి తప్ప దానిని కరిగిపోనివ్వకూడదు అంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు.
Also read: Kannappa Postponed: కన్నప్ప సినిమాపై షాకింగ్ అప్ డేట్.. కీలక ప్రకటన చేసిన మంచు విష్ణు
‘‘ముఖ్యంగా చిరాకు, బాధ, కోపం, సంతోషం ఇలా ప్రతి అంశాన్ని కూడా స్వీకరించాలి. దాంతోపాటే ముందుకు సాగాలి” అని అన్నాడు. మొత్తానికైతే రిలేషన్‌షిప్‌ను ఐస్ క్రీమ్‌తో పోల్చడంతో నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. తమన్నాతో బ్రేకప్‌ను ఉద్దేశించే విజయ్ వర్మ ఇలాంటి కామెంట్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు, తమన్నా కూడా ఇటీవల ప్రేమ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. “ప్రేమను ఎప్పుడైతే వ్యాపారలావాదేవీగా చూడడం మొదలుపెడతామో అప్పుడే అసలైన సమస్యలు వస్తాయి. నిస్వార్ధంగా ఉన్న ప్రేమనే నేను నమ్ముతాను. ముఖ్యంగా భాగస్వామి ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి’’ అని చెప్పింది.