Hyderabad Metro image Source ( Twitter)
హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై మెట్రో సేవలు మరింతగా..

Hyderabad Metro: హైదరాబాద్‌లో మెట్రో ( Hyderabad Metro )  వచ్చిన తర్వాత నుంచి ప్రజలు తమ పనులను చక చకా చేసుకుంటున్నారు.జనాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రో ప్రయాణికులకు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి గొప్ప శుభవార్త చెప్పారు. మెట్రో సమయం పొడిగించినట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు చివరి మెట్రో రాత్రి 11 గంటల వరకు ఉండగా..  ఇకపై రాత్రి 11.45 గంటల వరకు నడుస్తుందని వెల్లడించారు. కొత్తగా మార్చిన ఈ టైమింగ్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు.

Also Read: Ugadi Festival 2025: తెలుగువారి తొలి పండుగ.. ఉగాదిపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం..

అయితే, సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ టైమింగ్స్ అమల్లో ఉంటాయని తెలిపారు. అలాగే, ఆదివారాల్లో మొదటి ట్రైన్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభవుతుందని అన్నారు.అలాగే, హైదరాబాద్ మెట్రోను విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించుకున్నారని అన్నారు. వారికి కూడా గుడ్ న్యూస్ చెపింది. స్టూడెంట్స్ 20 ట్రిప్పులకు మాత్రమే చెల్లించి 30 ట్రిప్పులను పొందే ఆఫర్ ను మరో ఏడాది పాటు మెట్రో పొడిగించింది. అంటే, 2026 మార్చి 31 వరకు కొనసాగనుంది. అలాగే, 2024ఏప్రిల్ లో మొదలైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ (SSO), ఆఫ్-పీక్ తగ్గింపు ఆఫర్ 2025 మార్చి31తో ముగుస్తుందని తెలిపారు.

Also Read: Viral Video: ఇతని క్రియోటివిటి చూస్తే క్రికెటర్లు కూడా సెల్యూట్ చేయాల్సిందే..!

ఎండీ శ్రీ ఎన్‌విఎస్ రెడ్డి మాట్లాడుతూ  ” హైదరాబాద్ మెట్రో రైలు, కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు.. ఇది పట్టణ పరివర్తన , సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. మెట్రో ఫెస్ట్, మెట్రో మెడ్లీ, ఆర్ట్ ఫెస్ట్ వంటి ఈవెంట్స్ ను మా రవాణా వ్యవస్థలో చేర్చడం వలన, ప్రజా రవాణా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంలో మేము ముఖ్య పాత్ర పోషిస్తున్నాము” అని అన్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?