David Warner: ఛలో, భీష్మ వంటి సినిమాల విజయంతో వెంకీ కుడుముల (Venky kudumula ) మంచి పేరును సంపాదించుకున్నాడు. అయితే, మూడో సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. మెగా ఆఫర్ వచ్చినా అది వర్కవుట్ అవ్వలేదు. ఇక తనకి బాగా కలిసొచ్చిన హీరో నితిన్‌తోనే ” రాబిన్ హుడ్ ” ( Robinhood ) తీశాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా మార్చి 28 న రిలీజ్ అయింది.
ప్రస్తుతం, మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. అయితే, గత కొద్దీ రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా పేరే బాగా వినబడుతోంది. కారణం, చిత్రంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించడం. ఐపీఎల్ నుంచి తెలుగుకి సంబంధించిన ఎన్నో రీల్స్ చేసి చాలా ఫేమస్ అయ్యాడు. అలా తక్కువ సమయంలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఎట్టకేలకు, నితిన్ మూవీతో మన టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. సినిమా టాక్ ఎలా ఉన్నా వార్నర్ కోసమే చాలా మంది సినిమా చూడటానికి వెళ్తున్నారు.
Also Read: Railway Jobs: రైల్వేలో 9 వేల ఉద్యోగాలు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
వార్నర్ ( David Warner ) చేసిన పాత్రకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే డేవిడ్ వార్నర్ ” రాబిన్ హుడ్ ” చిత్రంలో చూసిన ప్రేక్షకులు రక రకాలుగా వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 లో చోటు దక్కకపోవడంతో అతని ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇప్పుడు, ఇలా చూడటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి కొందరు, వార్నర్ మామ ఎక్కడున్నా అక్కడ ఏలిస్తాడురా అంటూ ఫన్నీగా కౌంటర్లు వేస్తున్నారు. రెండు గంటల ముప్ఫై ఆరు నిముషాల నిడివిలో వార్నర్ జస్ట్ 3 నిముషాలు మాత్రమే ఉన్నప్పటికీ.. బిగ్ స్క్రీన్ మీద అతన్ని చూసిన ఆడియెన్స్ విజిల్స్ తో థియేటర్లలో గోల గోల చేస్తున్నారు.
Also Read: Telangana Govt: రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఒక్కటే కాదు.. ఇంకా?
ఈ వార్త పై రియాక్ట్ అయిన నెటిజన్స్ ఐపీఎల్ లో లేకపోతే ఏం .. ఇక్కడ మంచి పేరు సంపాదించేసావ్ గా .. వార్నర్ మామకు తిరుగే లేదు. తెలుగు బాగా నేర్చుకుని త్వరలో సినిమాల్లో హీరోగా రాణించాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.