Hrithik Roshan: స్టార్ హీరో హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం ఇతన్ని హీరోగానే చూశాము. ఇప్పుడు, ‘క్రిష్ 4’ మూవీతో దర్శకుడిగా కూడా చూడబోతున్నాము. తన తండ్రి రాకేష్ రోషన్ నడిపిస్తున్న ఫ్రాంచైజీ బాధ్యతను కూడా త్వరలో స్వీకరించబోతున్నాడు. ఈ చిత్రాన్ని రాకేష్ రోషన్‌తో కలిసి యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇండియన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఈ ఫ్రాంచైజీలో టైటిల్ సూపర్ హీరో పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం దర్శకత్వం, యాక్టింగ్ అంటూ రెండు పడవల మీద కాలేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కానుంది.
Also Read: MLA Donthi Madhava Reddy: దొంతి కి మంత్రి పదవి? ఛాన్స్ ఇవ్వాలని వేడుకోలు..
ఈ సందర్బంగా రాకేష్ రోషన్ (Rakesh Roshan ) మాట్లాడుతూ.. ” క్రిష్ 4 ( Krrish 4 ) దర్శకుడి బాధ్యతను నా కొడుకు హృతిక్ రోషన్ కు అప్పగిస్తున్నాను. అతను ఈ ఫ్రాంచైజీ ప్రారంభం నుండి ఉన్నాడు. రాబోయే దశాబ్దాల పాటు ప్రేక్షకులతో కలిసి క్రిష్ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లాలనే స్పష్టమైన, ప్రతిష్టాత్మకమైన దృష్టి హృతిక్ కు ఉంది. ‘క్రిష్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. హృతిక్ ఇప్పుడు ఈ సూపర్ హీరో బాధ్యతలను తీసుకోనున్నాడు. చాలా ఏళ్ళ క్రితం నేను క్రియోట్ చేసిన ఈ సంస్థను మరింత ఎత్తుకు తీసుకెళ్తాడు ” అని అన్నారు.
Also Read: Police Jobs for 10th: పది అర్హతతో పోలీస్ ఉద్యోగాలు.. ఇక ఐదు రోజులే ఛాన్స్
హృతిక్ కు డైరెక్షన్ కొత్తేమి కాదు. అతను తన తండ్రి దర్శకత్వం వహించిన ‘కరణ్ అర్జున్’ వంటి చిత్రాల సెట్లలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. నిజానికి, నటులు సినిమా సెట్‌లో మెళకువలు నేర్చుకోవడం, సినిమా నిర్మాణంలో ఉన్న సాంకేతిక అంశాల గురించి తెలుసుకోవడం, ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందడం అనేది కొందరితోనే సాధ్యమవుతుంది.
ఆదిత్య చోప్రా ‘క్రిష్ 4’ నిర్మాతగా బాధ్యతలు చేపట్టడం పట్ల రాకేష్ రోషన్ చాలా సంతోషంగా ఉన్నారు.” క్రిష్ 4 నిర్మాతగా ఆది లాంటి వ్యక్తిని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. హృతిక్‌ను దర్శకుడి కుర్చీలో కూర్చోబెట్టడానికి ఆయనే ఒప్పించారు. ‘క్రిష్ 4’ వంటి మూవీ జీవితానికి మించిన అనుభవంతో ప్రపంచవ్యాప్తంగా గర్వపడేలా చేయడమే కల” అని ఆయన అన్నారు.