Food Safety In Hyderabad (imagecredit:twitter)
హైదరాబాద్

Food Safety In Hyderabad: హైదరాబాద్ లో కల్తీ ఆహారానికి బ్రేక్…

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Food Safety In Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకి పెరుగుతున్న కల్తీ ఆహార విక్రయాలకు బ్రేక్ వేయటంతో పాటు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పెంచే దిశగా సర్కారు ఫోకస్ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఏడు సర్కిళ్ల నుంచి 30 సర్కిళ్లకు విస్తరించటంతో పాటు జనాభా కూడా కోటి 20 లక్షలు దాటడంతో ప్రస్తుతం కేవలం 21 మంది ఫుడ్ ఇన్ స్పెక్టర్లున్నందున, ఆశించిన స్థాయిలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పెరగకపోవటంతో పెరుగుతున్న పట్టణీకరణ, కాలుష్యం, ఆహార విక్రయ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీని పెంచే అంశంపై ఇటీవలే సర్కారు వద్ద ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ ఆర్వీ. కన్నన్,హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (హెల్త్) పంకజ లతో సర్కారు వద్ద ఇటీవలే కీలక సమావేశం జరిగినట్లు, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల పెంపుపై చర్చించినట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం30 సర్కిళ్లకు గాను ప్రస్తుతం 21 మంది ఫుడ్ ఇన్ స్పెక్టర్లున్నందున, ఆహార విక్రయ కేంద్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నామన్న విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సర్కారు వద్ద ప్రస్తావించటంతో ఇంకెంత మంది ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అవసరమవుతారన్న సర్కారు ప్రశ్నకు మరో 30 మంది కేటాయించాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదనకు సర్కారు  అంగీకరించినట్లు తెలిసింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే ల్యాబ్ 

మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి సేకరించే శ్యాంపిల్స్ లో నాణ్యత, కల్తీని తేల్చేందుకు టెస్తులు నిర్వహించేందుకు హబ్సిగూడలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐఎన్)పని చేస్తుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా, రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే ల్యాబ్ అందుబాటులో ఉంది. ఈ ల్యాబ్ లో 75 శాతం జీహెచ్ఎంసీకి చెందిన శ్యాంపిల్స్ టెస్టులు జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరో 25 శాతం శ్యాంపిల్స్ టెస్టులకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

పైగా సకాలంలో రిపోర్టులు కూడా రావటం లేదన్న విషయం సర్కారు వద్ద ప్రస్తావనకు రాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో జోన్ కు ఒకటి చొప్పున మొత్తం ఆరు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు చేసిన ప్రతిపాదనలకు సర్కారు అంగీకరించినట్లు తెలిసింది. అయితే వీటి ఏర్పాటుకు స్థలాలు జీహెచ్ఎంసీ చూపించాలని సర్కారు సూచించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1700 కాలనీ, బస్తీలకు చెందిన కమ్యూనిటీ హాళ్లున్నాయని, వీటిలో కొన్నింటిలో ఇప్పటికే బస్తీ దవాఖానాలు కొనసాగుతున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు సర్కారుకు విన్నవించగా, ఫుడ్ టెస్టు ల్యాబ్ ల కోసం స్థలాలను జీహెచ్ఎంసీ సూచించాలని సర్కారు ఆదేశించటంతో ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు కమ్యూనిటీ హాళ్లను అన్వేషించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.

రెండు నెలల్లో 1444 దాడులు 203 శ్యాంపిల్స్ సేకరణ

గడిచిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలోని దాదాపు 1444 ఆహార విక్రయ కేంద్రాలు, నిత్యావసరాలు విక్రయించే సంస్థలపై దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 203 శ్యాంపిల్స్ ను సేకరించగా, 13 శ్యాంపిల్స్ లో లోపాలు, కల్తీని గుర్తించినట్లు, వీటిలో నాలుగు శ్యాంపిల్స్ అన్ సేఫ్ గా తేలినట్లు అధికారులు తెలిపారు.

నలుగురు ఫుడ్ ఇన్ స్పెక్టర్ల సస్పెన్షన్ ఎత్తివేత 

ఏడాది కాలం క్రితం నలుగురు ఫుడ్ ఇన్ స్పెక్టరపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీలో ఫుడ్ ఇన్ స్పెక్టర్ల సంఖ్య 25కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నలుగురు ఫుడ్ ఇన్ స్పెక్టర్లు తమపై అధికారులకు ముందస్తుగా ఎలాంటి సమాచారమివ్వకుండా లీవ్ లో వెళ్లినట్లు గుర్తించిన అధికారులు వీరిపై సస్పెన్షన్ విధించారు. ఇపుడ ఆ సస్పెన్షన్ ఎత్తి వేయటంతో ఫుడ్ ఇన్ స్పెక్టర్ల సంఖ్య 25కు పెరగనున్నట్లు, త్వరలోసర్కారు కేటాయించనున్న 30 మంది ఫుడ్ ఇన్ స్పెక్టర్లతో కలిపి వీరి సంఖ్య 55 కు చేరనుంది.

Also Read: Swetcha Media: స్వేచ్చ ఎఫెక్ట్.. మొక్కజొన్న పంటకు కదిలిన అధికారులు..

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ