Swetcha Media
నార్త్ తెలంగాణ

Swetcha Media: స్వేచ్చ ఎఫెక్ట్.. మొక్కజొన్న పంటకు కదిలిన అధికారులు..

ములుగు మహబూబాబాద్ స్వేచ్ఛ: Swetcha Media: ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల, వరంగల్ జిల్లా గూడెప్పాడు మండలాలతో పాటు పినపాక, కరకగూడెం, కాటాపురంలలో మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల దందా ఆర్గనైజర్లు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివాసి రైతులకు స్వేచ్ఛ అండదండలు అందిస్తూ వస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం నిద్రలో ఉంటే స్వేచ్ఛ రైతుల తరఫున స్వేచ్ఛాయుతమైన కథనాలు వెలువరుస్తుంది.

ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల దందాతో రైతులు తీవ్రమైన నష్టాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం నిద్రలో ఉంటే స్వేచ్ఛ పత్రిక రైతుల తరఫున స్వేచ్ఛాయుతమైన కథనాలు ప్రచురించి రైతుల మన్ననలు పొందుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని వివిధ మండలాల్లో సేద్యం చేసే ఆదివాసి రైతులను మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీలు ఆర్గనైజర్లు తమ దురాగతాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్వేచ్ఛ ఆదివాసి రైతులకు మేలు చేసేందుకు ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది.

దీంతో ఆదివాసీ రైతుల కుటుంబాలు స్వేచ్ఛపై ప్రత్యేకమైన నమ్మకాన్ని ఉంచుతూ మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీలు, ఆర్గనైజర్లు చేస్తున్న దందాపై ఆదివాసి రైతులు స్వేచ్ఛకు విశ్వసనీయ సమాచారం అందిస్తూ వస్తున్నారు. జీవితం పై ఆశలు ఉడికిన అన్నదాతలకు విశ్వాసంగా మారింది స్వేచ్ఛ. అన్నదాతల పోరాటాన్ని జిల్లా సరిహద్దులు దాటించి, రాష్ట్ర రాజధానికి చేర్చిన స్వేచ్ఛ కృషి ఎనలేనిది అంటూ స్వేచ్ఛకు హ్యాట్సాఫ్ చెబుతున్న ఆదివాసి రైతులు.

ఆదివాసీ రైతులకు అండగా నవ నిర్మాణ సేన అధ్యక్షుడికి ఆర్గనైజర్లతో త్రెట్..

మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీలు, ఆయా కంపెనీల ఆర్గనైజర్లు ఆదివాసీ రైతులపై చేస్తున్న దురాగతానికి ఆదివాసీ నవనిర్మాణ సేన అధ్యక్షుడికి ప్రమాదం పొంచి ఉంది. స్వేచ్ఛ కథనాలు మొదలైనప్పటి నుంచి ఆదివాసీ నవనిర్మాణ సేన అధ్యక్షుడికి పూర్తిస్థాయి స్వేచ్ఛ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆదివాసీ నవనిర్మాణ సేన అధ్యక్షుడు తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఆదివాసి రైతులకు జరుగుతున్న నష్టాలపై స్పందిస్తున్నారు. తన ప్రాణానికి హాని తలపెడుతున్న కొంతమంది ఆర్గనైజర్ల దాటికి తట్టుకొని స్వేఛాయుత వరుస కథనాలతో తనకేం కాదని ధీమాతో ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలోనే జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో స్పందించి ఏజెన్సీ ఏరియాలో జరిగే మనీ లాండరింగ్ పై చర్యలు తీసుకోవాల్సింది పోయి తన బాధ్యతల్ని మర్చిపోతున్నారు. ఆదివాసీ రైతుల తరఫున చర్యలు చేపట్టాల్సిన అధికారులు మిన్నకుండి పోతున్నారు. దీనికి కారణం ఏంటో ఆదివాసీ రైతులకు, ప్రజలకు అంతుచిక్కకుండా పోతుంది. ఇద్దరు యువ ఆదివాసి రైతులు మొక్కజొన్న సీడ్ కంపెనీల దురగాతంపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటే కాపాడాల్సిన అధికారులు తమపై మావోయిస్టుల ముద్ర వేసేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆదివాసీ రైతులకు జరుగుతున్న నష్టాలపై మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తనాల కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదని వాపోతున్నారు.

ఆదివాసీల రైతులు, నాయకులకు అండగా స్వేచ్ఛ 

ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో మల్టీ నేషనల్ కంపెనీలు, ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలపై స్వేచ్ఛ సీడ్ బాంబ్ కథనంతో వారి దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ముందుకెళ్ళింది. అప్పటినుంచి నేటి వరకు మల్టీ నేషనల్ మొక్కజొన్న కంపెనీలు, ఆయా కంపెనీలకు సంబంధించిన ఆర్గనైజర్ల మోసాలపై ఆదివాసీ రైతులు, నాయకులకు స్వేచ్ఛ అండగా నిలుస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది. ఆదివాసీ రైతులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించేంతవరకు అండగా నిలుస్తోంది.

ఎదురొచ్చిన అధికారులను, ఆర్గనైజర్ల దురాగతాలపై కథనాలను ప్రచురిస్తూనే ఉంటుంది. ముఖ్య విషయం ఆదివాసి ప్రాంతాల్లో ఆదివాసియేతర వ్యాపారులకు పని ఏంటని ఆదివాసి సంఘాల నాయకులు, రైతులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం అందించకపోవడం ఏంటోనని వాజేడు, వెంకటాపురం మండలాల్లోని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.

సిన్జెంటా ఆర్గనైజర్ అగ్రికల్చర్ భూమిపై వ్యవసాయ కమిషన్ ఆరా 

మొక్కజొన్న విత్తనాలు బీటీ సీడ్స్ గా తేలితే దుష్పరిణామాలు, మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీ సిన్జెంటా ఆర్గనైజర్ అగ్రికల్చర్ భూములపై వ్యవసాయ కమిషన్ ఆరా తీస్తోంది. ఇదే విషయమై ఈనెల 25న నిర్వహించిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి నేరుగా ఆర్గనైజర్ల వ్యవసాయ భూములపై నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆర్గనైజర్ల వ్యవసాయ భూములపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.

గురువారం వాజేడు వెంకటాపురం మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఉన్న ఆర్గనైజర్ల వ్యవసాయ భూములపై ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక జాబితా తయారు చేసి సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివరాలను వ్యవసాయ కమిషన్ కు అందజేయనున్నారు. అంతేకాకుండా వెంకటాపురం వాజేడు పోలీస్ స్టేషన్లో పలు గ్రామాల రైతులు ఆర్గనైజర్లపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు సైతం ఆర్గనైజర్ల దురాగతం పై వివరాలను సేకరించే పనిలో పడ్డారు. మొత్తానికి స్వేచ్ఛ వరుస కథనాల నేపథ్యంలో అటు అధికారులు, ఇటు ప్రజలలో ఆర్గనైజర్ల మోసపూరిత చర్యలపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల శాంపిల్స్ ల్యాబ్ నుంచి ఈ మధ్య రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

Also Read: Ugadi 2025: ఉగాది పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు.. నిధులు కేటాయించిన ప్రభుత్వం

మల్టీనేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీలు రైతులకు సరఫరా చేసే విత్తనాలు బీటీ సీడ్స్ గా రిపోర్ట్ లో వస్తే చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ రిపోర్టుల పైనే జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఆర్గనైజర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సైతం రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఆర్గనైజర్లలో మల్టీ నేషనల్ కంపెనీకి చెందిన ఆర్గనైజర్ సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూమిని వివిధ రైతుల ద్వారా కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు ఈ ఆర్గనైజర్లు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులను సైతం శాసించే స్థాయికి ఎదిగినట్లు అక్కడ రైతులు చర్చించుకోవడం గమనార్హం

మొక్కజొన్న పంటలను తిన్న పశువుల ఆరోగ్యాలపై పశుసంవర్ధక శాఖ పరిశీలన

మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తనాలతో సేద్యం చేసిన రైతుల పశువులు పంటలను తిన్న పశువుల ఆరోగ్యాలపై పశు సంవర్ధక శాఖ అధికారులు గురువారం పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తనాలతో ఆదివాసి రైతులకు జరిగిన నష్టాలపై ములుగు జిల్లా అధికారులు వాజేడు వెంకటాపురం మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. మల్టీ నేషనల్ కంపెనీల మోసాలపై పర్సనల్ స్టేట్మెంట్ రికార్డులను సైతం తయారుచేసి మండల స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు.

మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తనాలతో సేద్యం చేసిన రైతుల పంట క్షేత్రాలలోని మొక్కజొన్నలను శాంపిల్స్ గా సేకరించి హైదరాబాద్ వ్యవసాయ శాఖ ల్యాబ్ కు పంపించారు. ఈ రిపోర్ట్స్ రెండు మూడు రోజుల్లోనే ములుగు జిల్లా అధికారులకు చేరనున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాలపై నివేదిక, రెవెన్యూ అధికారులు రైతులకు జరిగిన పూర్తిస్థాయి నష్ట నివారణ కోసం మరో జాబితా, మొక్కజొన్న కంకులు తిని అనారోగ్యాన పడిన రిపోర్టులు, వివిధ రైతులు వాజేడు వెంకటాపురం మండలాల్లోని పోలీస్ స్టేషన్లో ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలపై ఫిర్యాదులు ఇప్పటివరకు జరిగాయి.

తాజాగా మొక్కజొన్న పంటలను తిని మృత్యువాత చెందిన పశువులు, రైతులకు సంబంధించిన పశువుల ఆరోగ్యాలపై పశుసంవర్ధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. తాజాగా గురువారం పశుసంవర్ధక శాఖ అధికారులు వివిధ గ్రామాల్లో మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీలతో సేద్యం చేసిన రైతులకు సంబంధించిన పశువుల ఆరోగ్యాలపై క్షేత్రస్థాయి సందర్శన, పరిశీలనలకు అధికారులు వచ్చారు. మొక్కజొన్న పంటను తిన్న పశువులకు సంబంధించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆరా తీస్తున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక జిల్లా స్థాయి అధికారులకు సమర్పించనున్నారు.

Also Read: Betting Case: బెట్టింగ్ కు ఆజ్యం పోసిందెవరు? ఆ నేత చిట్టా ఈడీకి చేరిందా?

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?