Interantional News us Preps For Retaliatory Iran Attack On Israel or Its Assets
అంతర్జాతీయం

International news: ఇజ్రాయెల్‌ని హెచ్చరించిన ఇరాన్, ప్రతీకారం తప్పదంటూ…

Interantional News us Preps For Retaliatory Iran Attack On Israel or Its Assets: తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఇరాన్ దాడి తప్పదన్న అంచనాకు వచ్చిన అగ్రరాజ్యం హై అలర్ట్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా తన సైన్యాలను హెఅలర్ట్‌లో పెట్టింది. సోమవారం డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇద్దరు ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఐదుగురు దుర్మరణం చెందారు. ఇరాన్ ప్రత్యేక సైనిక దళం కుడ్స్‌ ఫోర్స్‌కు చెందిన కమాండర్ల మరణంపై ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. శుక్రవారం ఇరాన్‌లో సైనికాధికారుల అంత్యక్రియలు నిర్వహించారు. తమ కమాండర్ లను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఈ సందర్భంగా హెచ్చరించింది.

ఇరాన్ తన దళాలను హైఅలర్ట్‌లో పెట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌కు తగ్గిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. మాపై దాడులు చేస్తున్న శత్రుమూకలకు తగిన సమాధానం చెబుతామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ కమాండర్ హుస్సైసీ సలామీ హెచ్చరించారు. అయితే, ఇరాన్‌ ఎలాంటి దాడి జరపొచ్చన్న అంశంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.

Also Read:కొండను ఎత్తిన బంగారుకొండ

అయితే ఇజ్రాయెల్‌లోని నిఘా, సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఇరాన్ దాడికి తెగబడితే ఎలా ప్రతిస్పందించాలనే దానిపై కూడా అమెరికా కసరత్తు చేస్తోంది. డ్రోన్స్ లేదా మిస్సైళ్ల ప్రయోగంతో ఇరాన్‌పై ప్రతిదాడి చేయాలనే అంచనాకు వచ్చింది. మరోవైపు, ఇరాన్ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ పన్నిన ఉచ్చులో పడొద్దని, ఈ అంశంలో జోక్యం చేసుకోవద్దని ట్విట్టర్ ఎక్స్‌ వేదికగా హెచ్చరించింది.

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..