Indian Weight Lifter Mirabai Chanu Qualified For Paris Olympics : జులై చివరివారం నుంచి ఒలింపిక్స్ క్రీడలు స్టార్ట్ కానున్నాయి. దీనికి పారిస్ వేదిక కానుంది. ఓ వైపు గ్రౌండ్ పనులు, మరోవైపు ఆటగాళ్ల ఎంపికలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం భారత్ సన్నద్దం అవుతోంది.
తాజాగా భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. గాయం కారణంగా ఆరునెలల పాటు ఆటకు దూరమైంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే కచ్చితంగా రెండు టోర్నీలో మూడు క్వాలిఫ్లయిర్స్‌తో తలపడాల్సి ఉంటుంది మీరాబాయి చాను. ఐడబ్ల్యూఎప్ ప్రపంచకప్ గ్రూప్-బి లో పోటీపడిన ఆమె, 49 కేజీల విభాగంలో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. మొత్తం 184 కేజీల బరువు ఎత్తేసింది. స్నాచ్‌లో 81 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 103 కేజీల బరువు ఎత్తి పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యింది.
Read Also: యూట్యూబర్ కిడ్నాప్, 6 లక్షల డాలర్ల డిమాండ్
క్వాలిఫికేషన్ ర్యాంకులో మీరాబాయి చాను ప్రస్తుతం సెకండ్ ప్లేస్‌లో ఉంది. టాప్ 10లో ఉన్న వెయిట్ లిఫ్టర్లు మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో చానుకు దాదాపు బెర్త్ ఓకే అయినట్టే. కాకపోతే అధికారికంగా అనౌన్స్‌మెంట్ మాత్రమే రావాల్సి ఉంది.ఆరునెలల తర్వాత మళ్లీ కోలుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది. చాలా హార్డ్‌గా వర్క్ చేశానని, అందుకు తగిన ప్రతిఫలం దక్కిందని మనసులోని మాటను రివీల్ చేసింది.
పారిస్ ఒలింపిక్స్‌కు బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. గోల్డ్ మెడల్ సాధించడమే తన నెక్స్ట్ టార్గెట్ అని వెల్లడించింది. నాలుగేళ్ల కిందట జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. తాజాగా గోల్డ్‌మెడల్ సాధించడం కోసం సాయశక్తుల కష్టపడుతోంది.