Sangareddy District Crime: నిర్భయ ఘటన గుర్తుందా? నిజానికి అది ఆ దురదృష్టకర సంఘటనకు పెట్టిన పేరు మాత్రమే కాకుండా.. స్త్రీల మీద దాడులు జరిగినప్పుడల్లా వినిపించే నినాదంలా మారిపోయింది. అయితే నిర్భయ లాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఆ రావణ కాష్టం రగులుతూనే ఉంది. అత్యచారాల పర్వం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో నిర్భయ ఘటనలాగే హైదరాబాద్ లో దిశ, ఇటీవల కలకత్తాలో మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం, నిన్న గాక మొన్న పూణేలో నడిబొడ్డున బస్సులో రేప్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.
Saweety Boora: పోలీసు స్టేషన్ లో వాగ్వాదం.. భర్తపై దాడి చేసిన ప్రముఖ మహిళా బాక్సర్
తాజాగా సంగారెడ్డి జిల్లాలో మరో దారుణం జరిగింది. ఆటోలో భర్తతో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 65వ జాతీయ రహదారిపై ఉన్న మామిడిపల్లి చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
భర్తను కొట్టి భార్యను రేప్
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం తెల్లవారుజామున భార్తభర్తలిద్దరు కలిసి ఆటోలో పెద్ద కంజర్ల గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు దుండగులు వారిని గమనించారు. అనంతరం వారి వాహనాన్ని వెంబడించి ఓ ప్రదేశంలో ఆపేశారు. అనంతరం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన భర్తపై దాడి చేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం భాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. అయితే, ఘటన జరిగింది అర్థరాత్రి దాటాక అని తెలుస్తుండటంతో మద్యం మత్తులోనే దుండగులు ఈ ఘోరానికి పాల్పడ్డారా? అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఆటలో వాళ్లిద్దరే ఉన్నారా లేక ఇంకేవరైనా ఉన్నారా తదితర వివరాలు తెలియాల్సి ఉంది. పక్కనే భర్త ఉన్నప్పటికీ ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారా అనేది పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. బాధితురాలు భర్తకు దుండగులకు మధ్య ఏదైనా ఘర్షణ జరిగడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా లేక కావాలనే వెంటపడ్డారా అనేది నిందితుల చిక్కిన అనంతరం విచారణలో తేలనుంది. కాగా,ఇప్పటికే ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ పంకజ్.. నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.