తెలంగాణ స్వేచ్చ:Rajendra Prasad on Warner: తెలుగు సినీనటుడు రాజేంద్రప్రసాద్ ఎట్టకేలకు దిగివచ్చాడు. రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై చేసిన కామెంట్స్ పై వివాదం రాజేంద్రప్రసాద్ కి తీవ్ర దుమారం సృష్టించాయి. టాలివుడ్ స్టార్ నితిన్, రాబిన్ హుడ్ టాలివుడ్ స్టార్ నితిన్ రాబిన్ హుడ్ చిత్రంలో సినీ ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అవుతున్నారు. వెంకి కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇ నెల 28 న విడుదల కానుంది.
అయితే దీనికి మరికొద్ది రోజులే వుండటంతో ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ ను యునిట్ జోరుగా నిర్వహించి, సినిమాకు సంభందించిన అప్టేట్స్ అందిస్తూ సినిమాపై ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపే విధంగా హైప్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ పట్టనంలో ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, మరియు ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు, ఈ క్రమంలోనే రాజేద్రప్రసారద్ మాట్లాడుతు ఓరే డేవిండ్ వార్నరూ.. దొంగ ముండా కొడుకా.. నువ్వు మాములోడివి కాదుర అని సంచలన వాక్యలు చేశాడు. అది విన్న అక్కడి వాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు. రాజేంద్ర ప్రసాద్ ఆవిధంగా మాట్లాడటం సరికాదని ఆ ఈవెంటు లోని సభ్యులందరు భావిస్తున్నారు. ఐతే డేవిడ్ వార్నర్ కి తెలుగు రానందున నవ్వుతూ వుండి పోయాడు.
రాబిన్ హుడ్ చిత్రం ఈవెంట్ కు డేవిడ్ వార్నరే స్పెషల్ గెస్ట్ లా హాజరయ్యారు. దీంతో డేవిడ్ వార్నర్ మంచి ఆటగాడిగా పేరుంది, అతనికి తన స్వంత దేశంలో నే కాకుండా ఇండియాలో ను క్రికేట్ లో మంచి పేరుంది. దీంతో డేవిడ్ వార్నర్ కి మన దేశంలోను అభిమానులు వున్నారు. సినీనటుడు రాజేంద్రప్రసాద్ ఇలా మాట్లాడటం పద్దతి కాదని డేవిడ్ వార్నర్ అభిమానులు తీవ్రంగా రాజేంద్ర ప్రసాద్ ని విమర్శిస్తున్నారు. డేవిడ్ వార్నర్ కి క్షమాపన చెప్పాలని అభిమానులు డిమాండ్ చేశారు.
దీంతో రాజేంద్రప్రసాద్ డేవిడ్ అభిమానులకు బహిరంగ క్షమాపణ చెప్పాడు. నేను ఉద్దేశపూర్వకంగా కావాలని డేవిడ్ వార్నర్ ని అనలేదని రాజేంద్రప్రసాద్ అన్నారు. హీరో నితిన్, డేవిడ్ వార్నర్ ఇద్దరూకూడా నా సోంత పిల్లలు లాంటివారు కేవలం సరదాకోసమే అలా కామెంట్ చేశానని అన్నారు. అయినా సరే ఒకవేళ ఎవరైనా నా కామెంట్స్ వల్ల బాధపడి ఉంటే వారందరిని నేను బహిరంగ క్షమాపణ కోరుతున్నాను, దయచేసి నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దు అని అన్నారు. ఇకపై ఎవరిని ఉద్దేశించి అలాంటి కామెంట్స్ చేయను అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలు చాలా జరుగుతున్నాయి. సినీ రంగంలోని చాలామంది ప్రముఖులు ఇలాంటి వివాదాస్పద వాక్యలు చేస్తున్నారు. ఎక్కడ ఈవెంట్ జరిగిన ఎదోఒక విషయంపై వివాద వ్యాక్యలు చేసి సినీ ప్రేక్షకులను ఆకర్శించి తమ లాభంకోసం ప్రయత్నిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఇలాంటి వివాదాలు సాదారణమైపోయాయి.
Also Read; Mayor Vijayalaxmi: వరుస వివాదాల్లో మేయర్ విజయలక్ష్మి? అసలేం జరుగుతోంది?