Young Man Dies By Suicide (Image Source: ChatGPT)
హైదరాబాద్

Young Man Dies By Suicide: బెట్టింగ్ యాప్స్ కు మరో ప్రాణం బలి.. అక్క పెళ్లికి దాచిన డబ్బు పోగొట్టుకొని..

Young Man Dies By Suicide: బెట్టింగ్ యాప్స్ (Betting Apps) పై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) సమరం శంఖం పురించినా సంగతి తెలిసిందే. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ఓనర్లు సహా పదులు సంఖ్యలో సెలబ్రిటీలపై హైదరాబాద్ మియాపూర్ పోలీసు స్టేషన్ (Miapur Police Station) లో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సైతం పోలీసుల విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి పోలీసులకు స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. అయితే కేంద్ర స్థాయిలో బెట్టింగ్ యాప్స్ పై చర్యలు మెుదలైనా.. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి ఫలితాలు కనిపించడం లేదు. బాధితుల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో యువకుడు బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు విడిచాడు.

అక్క పెళ్లి దాచిన డబ్బు
హైదరాబాద్ లో మరో యువకుడు బెట్టింగ్ యాప్స్ కు బలయ్యాడు. మేడ్చల్ పరిధిలోని గుండ్లపోచంపల్లికి చెందిన సోమేశ్ (Somesh).. బెట్టింగ్ యాప్ లో దారుణంగా మోసపోయాడు. క్రికెట్ పై బెట్టింగ్ పెట్టి రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. అక్క పెళ్లి కోసం తల్లిదండ్రులు ఆ డబ్బు దాచగా.. ఈజీ మనీకోసం దానిని బెట్టింగ్ లో పెట్టుబడిగా సోమేశ్ పెట్టాడు. బెట్టింగ్ లో ఓడి ఆ డబ్బు కోల్పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

రైలు కిందపడి..
తోడబుట్టిన అక్క పెళ్లికి దాచిన డబ్బును బెట్టింగ్ లో కోల్పోవడంతో సోమేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లో చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయాడు. ఎవరికి చెప్పాలో తెలియక.. సాయం చేసేవారు లేక ఆత్మహత్యే శరణ్యమని సోమేశ్ భావించాడు. రైలు కింద పడి బలవంతంగా ప్రాణాలు విడిచాడు. కుమారుడి మరణంతో సోమేశ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Also Read: Anantapur News: ఏపీలో అద్భుతం.. ఆ యువకుడి మాటే నిజమైందా?

20మందికి పైగా ఆత్మహత్య
బెట్టింగ్ యాప్స్ ఆగడాలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించినా బాధితుల మరణాలు ఆగకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసులు త్వరితగతిన విచారణ చేపట్టి బాధ్యులను కటకటాలపాలు చేయాలన్న డిమాండ్ సమాజం నుంచి గట్టిగా వినిపిస్తోంది. కాగా ఇప్పటివరకూ బెట్టింగ్ యాప్స్ బారిన పడి తెలంగాణ వ్యాప్తంగా 20 మంది వరకూ చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే అనధికారికంగా ఈ లెక్కలు మరింత ఎక్కువగా ఉండొచ్చన్న ప్రచారమూ ఉంది.

Also Read This: MLA Raja Singh: రాజాసింగ్ యూటర్న్.. సీఎం రేవంత్ పై ప్రశంసలు.. కేటీఆర్ పై విమర్శలు

హైకోర్టులో క్వాష్ పిటిషన్
ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి 11మంది ఇన్ ఫ్లూయెన్సర్లు, 25 మంది సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో రానా దగ్గుబాటి (Rana Daggubati), ప్రకాష్ రాజ్ (Prakash Raj), విజయ్ దేవరకొండ (Vij, మంచు లక్ష్మీ సహా పలువురు సినీ నటులు ఉన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ.. తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీనిపై త్వరలో కోర్టు విచారణ జరపనుంది.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?