MLA Raja Singh: హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కు మద్దతుగా విపక్ష బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ (KTR) పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఆదేశాలతో ఇంట్లోకి చొచ్చుకెళ్లిమరీ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాజా సింగ్ గుర్తుచేశారు. అయినప్పటికీ రేవంత్ ఎలాంటి ప్రతీకార రాజకీయాలకు తెరలేపలేదని రాజాసింగ్ ప్రశంసించారు.
రేవంత్.. ప్రతీకారం తీర్చుకోలేదు
తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు BRS ముఖ్యనేత కేటీఆర్ (KTR) వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో పోలీసులు ఆయన బెడ్రూంలోకి చొచ్చుకెళ్లిమరీ అరెస్టు చేశారని రాజాసింగ్ అన్నారు. కేటీఆర్ ఆదేశాలతోనే అదంతా జరిగిందని ఆరోపించారు. అయితే రేవంత్ అధికారంలోకి వచ్చాక తనని అరెస్టు చేసిన వారిని ఏమి చేయలేదని రాజాసింగ్ ప్రశంసించారు.
అధికారం వైపై పోలీసుల మెుగ్గు
తాము అధికారంలోకి వస్తే రిటైరైన పోలీసులను సైతం వదలేది లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాజాసింగ్ తప్పుబట్టారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల మాటనే పోలీసులు వింటారన్న సంగతి మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. పోలీసులు.. చట్టాన్ని అనుసరించే పనిచేస్తారన్న ఆయన బీజేపీ కార్యకర్తల పైనా కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నట్లు చెప్పారు. గతంలో తనపై పీడీ యాక్ట్ (PD Act) పెట్టి జైలుకు పంపిన విషయాన్ని సైతం తాజాగా గుర్తుచేశారు.
‘నా అరెస్టు వెనక బీజేపీ నేతలు’
పీడీ యాక్ట్ కింద జైలుకు పంపే సమయంలో కొందరు బీజేపీ నేతలు, అధికారులు పోలీసులకు మద్దతుగా నిలిచారని రాజాసింగ్ అన్నారు. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి స్వయంగా తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ కొందరు బీజేపీ నేతలు తనకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారని రాజాసింగ్ ఆరోపించారు. తాను జైల్లో ఉన్న సమయంలో తన అన్న (పేరు రివీల్ చేయలేదు) అండగా నిలబడ్డారని రాజాసింగ్ గుర్తుచేశారు. నేటికి తనతో ఆయన ఉన్నారని భావిస్తున్నట్లు అనుకుంటున్నానని చెప్పారు. అయితే ఆయన ప్రస్తుతం ఎటువైపు ఉన్నారో అర్థం కావడంలేదని రాజాసింగ్ సందేహం వ్యక్తం చేశారు.
Also Read: Meerpet Murder Case: మీర్ పేట్ మాధవి హత్య కేసులో బిగ్ ట్విస్టు.. డీఎన్ఏ రిపోర్టులో సంచలన నిజాలు
అధ్యక్షుడు రబ్బర్ స్టాంపే!
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఇటీవల స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా? జాతీయ నాయకత్వమా? అంటూ ప్రశ్నించారు. ఒకవేళ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రాబోయే అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటారని సెటైర్లు వేశారు. అలాకాకుండా పార్టీ అధ్యక్షుడ్ని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే బాగుంటుందని రాజాసింగ్ అన్నారు.