Hyderabad Crime (image credit:Canva)
హైదరాబాద్

Hyderabad Crime: చదివేది బీటెక్.. చేసేది గంజాయి దందా.. చివరకు?

Hyderabad Crime: ఒడిషా నుంచి గంజాయి స్మగ్లింగ్​ చేస్తూ హైదరాబాద్​ తోపాటు వేర్వేరు ప్రాంతాల్లో విక్రయిస్తున్న గంజాయి డాన్​ ను ఎక్సైజ్​ స్టేట్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుని నుంచి 115 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్​ భవన్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్​ ఎన్​ ఫోర్స్​ మెంట్​ జాయింట్​ కమిషనర్ ఖురేషి, అదనపు ఎస్పీ భాస్కర్​ తో కలిసి వివరాలు తెలిపారు. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా బూర్గుపాడు ప్రాంతానికి చెందిన డీ.శివారెడ్డి కొన్నేళ్లుగా గంజాయి దందా చేస్తున్నాడు.

ఈ క్రమంలో 2019లో 150 కిలోలు, 2022లో 400 కిలోలు, 2024లో ఒకసారి 240, మరోసారి 120 కిలోల గంజాయితో ఎక్సైజ్​ అధికారులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు. జైలుకు వెళ్లిన ప్రతీసారి బెయిల్​ పై విడుదలై బయటకు వస్తున్న శివారెడ్డి తిరిగి గంజాయి స్మగ్లింగ్​ ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే మరో ఇద్దరితో కలిసి కారులో ఒడిషా వెళ్లిన శివారెడ్డి 115 కిలోల గంజాయి కొన్నాడు. దానిని కారులో దాచి పెట్టి హైదరాబాద్​ చేరుకున్నాడు.

జేఎన్​టీయూ మెట్రో స్టేషన్​ దగ్గర దానిని కొనుగోలుదారునికి ఇవ్వటానికి ప్రయత్నిస్తుండగా సమాచారం తెలిసి ఎక్సైజ్ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ సీ టీం లీడర్ డీఎస్పీ తుల శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శివసిద్దుతో పాటు కానిస్టేబుళ్లు మౌలాలి, దినేష్​, లోకేశ్​, వేణులతో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. శివారెడ్డిని అరెస్ట్​ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, అధికారులను చూసి శివారెడ్డి ఇద్దరు సహచరులు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నట్టు జాయింట్​ కమిషనర్​ ఖురేషి తెలిపారు.

Also Read: Betting Apps Promotion: సామాన్యుడి కన్నెర్ర.. సచిన్, విరాట్, షారుఖ్ పై పోలీసులకు ఫిర్యాదు

విద్యార్థుల అరెస్ట్​…
బీటెక్​ చదువుతూ గంజాయి దందా చేస్తున్న ముగ్గురు విద్యార్థులను కూడా ఎక్సైజ్ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్​బీ కాలనీ ప్రాంతంలోని వసంత్​ నగర్​ లో ఉంటున్న కరీంనగర్​ జిల్లా సుల్తాన్​ పూర్​ కు చెందిన రాహుల్​, పెద్దపల్లికి చెందిన అజయ్​ కుమార్​, పెద్దపల్లి జిల్లా కమాన్​ పూర్​ మండలానికి చెందిన అభిలాష్​ లు తాముంటున్న ఇంట్లోనే గంజాయి స్టాక్​ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందటంతో ముగ్గురిని అరెస్ట్​ చేసిన ఎక్సైజ్​ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ సిబ్బంది వారి నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు