TTD Budget 2025 (image credit:TTD)
తిరుపతి

TTD Budget 2025: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుండి దర్శనం క్షణాల్లోనే..

TTD Budget 2025: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా 2025-26 వార్షిక బడ్జెట్ ను సోమవారం ప్రవేశపెట్టారు. వార్షిక బడ్జెట్ సంధర్భంగా టీటీడీ బోర్డు పలు కీలక తీర్మానాలు చేసింది. ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 5258.68కోట్ల తో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 30కు పైగా అజెండా ఆంశాలతో పాటు పలు కీలక ఆంశాలపై చర్చించి తీర్మానాలను బోర్డు ఆమోదించింది.

టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించిన విషయాలను ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఈవో మాట్లాడుతూ.. తిరుపతిలో గల జూపార్క్ నుంచి కపిల తీర్థము వరకు ప్రయివేటు వ్యక్తులకు స్థలాలు అప్పగించరాదని తీర్మానించామన్నారు. టిటిడి భూములలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని నిర్ణయించినట్లు, దేశ విదేశాలలో వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణము కోసం ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. స్వామి వారి అస్తుల పరిరక్షణకు పూర్తి చర్యలు తీసుకుంటామని, ఇందు కోసం కమిటి ఏర్పాటు చేస్తామన్నారు.

న్యాయ వివాదాలలో ఉన్న భూములపై తొందరగా వివాదాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ కృషి చేస్తుందన్నారు. తిరుమలలో అన్యమతస్తులు ఉండరాదనే తీర్మానము చేశామని, రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలలో, దళిత వాడలలో ఆగిపోయిన ఆలయాల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని రాష్ట్ర రాజధానులలో వెంకన్న ఆలయాల నిర్మాణాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఆర్గానిక్ సప్లయర్స్ పేరుతో నాసిరకము సరకు సరఫరా చేస్తున్న ఏజెన్సీ కి ఇచ్చిన 25 వేల శ్రీనివాస దర్శనము టికెట్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి గంగమ్మ గుడి, కొడంగల్ లోని దేవాలయము, తలకోన ఆలయము, కరీంనగర్, బుగ్గ కర్నూలు, ధర్మవరంలో ఆలయాల అభివృద్దికి టీటీడీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సైన్స్ సిటీ కి ఇచ్చిన 20 ఎకరాల భూమి వెనుకకు తీసుకున్నామని, కాంట్రాక్ట్ టీటీడీ ఉద్యోగులకు స్విమ్స్ లో ఉచిత చికిత్సలకు అనుమతి ఇచ్చామన్నారు.

Also Read: AP Govt: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ ఫోన్ మోగిందా? డబ్బులు వచ్చినట్లే!

రెవెన్యూ ,విజిలెన్స్ వారితో కమిటి ఏర్పాటు చేసి గుర్తింపు లేని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు, వృద్దులు, వికలాంగులకు ఆఫ్ లైన్ దర్శనము ద్వారా దర్శన సౌకర్యం కల్పిస్తా మన్నారు. బ్రేక్ దర్శనము ఉదయము ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆగమ కమిటీలో కొత్తవారి నియామకం జరుగుతుందని ఈవో తెలిపారు.

శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లేక్స్ కు కోటి రూపాయలు సహాయము.. వసతి గృహాలలో 1875గదుల ఆధునీకరణకు రూ. 27కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. A1 టెక్నాలజీ ని ఇవ్వడానికి గూగుల్ ముందుకు వచ్చిందని, దీని ద్వారా దర్శనము సేవలు కొనసాగిస్తామన్నారు. ఇదే జరిగితే భక్తులకు అతి తక్కువ సమయంలో శ్రీవారి దర్శనభాగ్యం కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద భక్తులకు టీటీడీ మెరుగైన సేవలు అందించేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పవచ్చు.

రాబడి అంచనాలు :
❄ హుండీ కానుకల ద్వారా అత్యధికంగా 1729 కోట్లు
❄ బ్యాంకుల్లో డిపాజిట్లు పై వడ్డీ రూపంలో 1,310 కోట్లు
❄ ప్రసాదాల విక్రయాల ద్వారా 600 కోట్లు
❄ దర్శన టిక్కెట్లు విక్రయాల ద్వారా 310 కోట్లు
❄ ఆర్జితసేవ టిక్కెట్లు విక్రయాల ద్వారా 130 కోట్లు
❄ గదులు, కళ్యాణమండపాలు అద్దె రూపంలో 157 కోట్లు
❄ తలనీలాలు విక్రయాల ద్వారా 176.5 కోట్లు

— బడ్జెట్ కేటాయింపులు :
❄ ఉద్యోగులు జీతభత్యాలకు 1773.75 కోట్లు
❄ ముడి సరుకులు కొనుగోలుకు 768.5 కోట్లు
❄ కార్పోస్ & బ్యాంక్ డిపాజిట్లకు 800 కోట్లు
❄ ఇంజనీరింగ్ పనులకు 350 కోట్లు
❄ గరుడవారధి పనులకు 28 కోట్లు
❄ స్విమ్స్ ఆసుపత్రి కి 120 కోట్లు
❄ ఫెసిలిటీ మ్యానేజ్మెంట్ సర్వీస్ కు 80 కోట్లు
❄ ఇతర సంస్థల గ్రాంట్ లకు 130 కోట్లు
❄ హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రాజెక్టు & అనుబంధ ప్రాజెక్ట్ లకు 121.5 కోట్లు
❄ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం క్రింద 50 కోట్లు
❄ టీటీడీ విద్యాసంస్థలు & ఇతర వర్సిటీ క గ్రాంట్ లకు 189 కోట్లు
❄ ఆరోగ్యం & పారిశుధ్యం కు 203 కోట్లు
❄ నిఘా & భద్రతా విభాగానికి 191 కోట్లు
❄ టీటీడీ వైద్యశాలలకు 41 కోట్లు… స్విమ్స్ గ్రాంట్స్ కు 60 కోట్లు, బర్డ్ & ప్రాణదాన‌ ట్రస్ట్ కు 55 కోట్లు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?