AP Govt (Image Source: ChatGPT)
ఆంధ్రప్రదేశ్

AP Govt: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ ఫోన్ మోగిందా? డబ్బులు వచ్చినట్లే!

AP Govt: ఏపీలోని కూటమి సర్కార్ ఉద్యోగులు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రూ.6,200 కోట్ల నిధులను  ఆర్థిక శాఖ విడుదల చేసింది. సోమవారం ఉ.11.30 గం.ల నుంచే ఉద్యోగులకు బకాయిల చెల్లింపు ప్రక్రియ మెుదలైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఎల్లుండి సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో
ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన GLI, GPF నిధులు భారీగా పెరిగిపోవడంతో ఇటీవల సీఎం చంద్రబాబు (CM Chandra babu) స్పందించారు. ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ఆర్థికశాఖ తాజాగా రూ.రూ.6,200 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిధులను సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని  సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇతర పెండింగ్ బకాయిలను సైతం త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఏడాది జనవరిలోనూ ఉద్యోగుల బకాయిల కింద రూ.1,033 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

Read Also: Hyderabad MMTS Train: కదులుతున్న రైలులో అత్యాచార యత్నం.. ఓ స్త్రీ నీకు రక్షణ ఎక్కడ?

ఉద్యోగుల హర్షం
వైసీపీ (YSRCP) హయాం నుంచి పెండింగ్ ఉంటూ వచ్చిన GLI, GPF కూటమి ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుండటంతో ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా గత జగన్ (Jagan Mohan Reddy) ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల పెండింగ్ బకాయిలు దాదాపు రూ. 25,000 కోట్లకు చేరినట్లు అంచనా. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. విడతల వారిగా బకాయిలను చెల్లిస్తూ వస్తోంది.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?