తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Yuva Vikasam Scheme: గత ప్రభుత్వంలో బడ్జెట్‌లో కేటాయింపులు చేసినా ఆ తర్వాత వాటిని పట్టించుకోలేక నిర్లక్ష్యం జరిగిందని, దాదాపు 18% మేర నిధుల మంజూరే లేకుండా పోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు రోజుల క్రితం అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఎంబీసీ (మోస్ట్ బ్యాక్‌వర్డ్ కార్పొరేషన్) విభాగానికి ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు అప్పటి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అది మాటలకే పరిమితమైంది. ఒక్కసారి మాత్రమే నిధులు ఇచ్చినా వాటిని వినియోగించనేలేదనే విమర్శలను మూటగట్టకున్నారు.
Also read: Govt: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉగాది నుండి కొత్త పథకం ప్రారంభం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను సైతం నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం పలుమార్లు విమర్శించింది. ఇలాంటి ఆరోపణల స్థానంలో ఇప్పుడు యువ వికాసం స్కీమ్‌ను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ద్వారా రుణాలను అందజేయాలని భావించింది. దీంతో ఆ కార్పొరేషన్లు మళ్లీ యాక్టివ్ అయ్యాయి.ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకున్నవారికి ప్రభుత్వం ఈ కార్పొరేషన్ల ద్వారానే నిధులను విడుదల చేయనున్నది.
Also read: Meenakshi Natarajan: ఐక్యరాగమెత్తిన కాంగ్రెస్.. మీనాక్షి నటరాజన్ మార్క్ ఇదేనా?
రుణ సాయం పొందాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. దీంతో లబ్ధిదారుల దరఖాస్తులను స్క్రూటినీ చేసి నిబంధనలకు లోబడి ఉన్నవాటిని ఎంపిక చేసి పర్యవేక్షణ కమిటీ ద్వారా లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయనున్నాయి. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ బాధ్యతతో ఆ కార్పొరేషన్లలో హడావిడి నెలకొన్నది.వచ్చే నెల ఫస్ట్ వీక్ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉన్నందున మే నెల చివరి వరకూ అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా జరగనున్నది.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించనున్నది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో ఆ కార్పొరేషన్ల అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు.
Also read: Good News to Muslims: ముస్లింలకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం..
యువ వికాసం పథకం అమలు కోసం సుమారు రూ. 6 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించిన రానున్న ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేసింది. లబ్దిదారులకు గరిష్టంగా తలా రూ. 5 లక్షల వరకు సాయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రం మొత్తం మీద సుమారు ఐదు లక్షల మంది లబ్ధిదారులు యువ వికాసం ద్వారా సాయం అందుకుని స్వయం ఉపాధి పొందనున్నారు. సంవత్సర కాలంలో ఈ నిధులన్నింటినీ ఖర్చు చేయాలని భావించినందున ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లబ్దిదారులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది.
Also read: Local Body MLC Elections: హైదరాబాద్ లో ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన.. ఏప్రిల్ 23న పోలింగ్
ఆ ప్రకారమే దరఖాస్తులను పరిశీలించి ముసాయిదా జాబితా రూపొందించాల్సి ఉన్నందున ఈ నాలుగు కార్పొరేషన్లకు చెందిన జిల్లా ఆఫీసుల మొదలు రాష్ట్ర స్థాయి కార్యాలయం వరకు సిబ్బంది తలమునకలవుతున్నారు. లక్షలాది అప్లికేషన్లను వెరిఫై చేసి నిబంధనల మేరకు ఎంపిక చేయాల్సి ఉన్నందున ఇంతకాలం నామ్ కే వాస్తేగా నడిచిన వ్యవహారం ఊపందుకున్నది.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/