Local Body MLC Elections: హైదరాబాద్ లో మరోమారు ఎన్నికల నగరా మోగింది. స్థానిక సంస్థల్లో ఒక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 28న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ఈసీ ప్రకటించింది. ఏప్రిల్ 4న నామినేషన్ కు చివరితేదీగా నిర్ణయించినట్లు తెలిపింది. అలాగే ఏప్రిల్ 9 వరకూ నామినేషన్ ఉపసంహరణకు అనుమతించింది. ఏప్రిల్ 23న పోలింగ్ ఉంటుందని రెండ్రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్ (MLC Prabhakar) పదవీకాలం ముగియనుండటంతో ఈసీ (EC) ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి ఐదు స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసింది. ఇందులో అధికార పార్టీకి సంబంధించి నలుగురు, విపక్ష బీఆర్ఎస్ కు సంబంధించి ఒకరు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవమయ్యారు.
