నార్త్ తెలంగాణ

Warangal News: కడుపులో ఉండగానే.. చంపేస్తున్నారు.. చర్యలుంటాయా? ఉండవా?

వరంగల్,స్వేచ్ఛ: Warangal News: గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ (లింగ ఎంపిక నిషేదం) చట్టం 1994 నియమాలు 1996 ప్రకారం పుట్టబోయేది ఆడ బిడ్డా! మగ బిడ్డా! అని అడగడం, చెప్పడం చట్టరీత్యా నేరం.

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారికి,చేయించుకున్నవారికి ప్రోత్సహించిన వారికి 3 సం.ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10,000 నుండి 50,000 వరకు జరిమానా విధించబడును అనే ఈ ప్రకటనలు కేవలం అలంకార ప్రాయంగా మారుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా అనేక ఆస్పత్రుల్లో గర్బ నిర్ధారణ పరీక్షలు, గుట్టుగా భ్రూణ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లోని అమ్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో బాలికకు అబార్షన్ చేసిన ఘటన వెలుగులోకి రావడంతో వ్యవహారంతో భ్రూణ హత్యలు కొనసాగుతున్నాయని రుజువైంది. చట్ట విరుద్ధంగా కాసులకు కక్కుర్తి పడుతున్న పలు హాస్పిటల్స్ లింగ నిర్ధారణ పరీక్షలు చేసి లోకం చూడకుండానే గర్భస్థ శిశువువులను గర్భంలోనే చిడిమేస్తున్నారు.

అధికారుల తీరుపై అనుమానాలు

అక్రమంగా అబార్షన్ చేసిన తొర్రూరులోని అమ్మ మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ దవాఖానపై వైద్యాధికారులు స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. బాలికకు ఆ దవాఖానలో అబార్షన్ చేయించారని స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ వైద్యా ధికారులు కేవలం నోటీసులు, మెమోలు జారీ చేసి, చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యాధికారులు నాలుగు గంటల పాటు చర్చలు జరిపి, దవాఖానపై ఏలాంటి చర్యలు తీసు కోకుండా వెళ్లిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి.

Also read: Sangareddy News: ప్రియుడి కోసం భర్త హత్యకు ప్లాన్.. బెడిసికొట్టి భార్య జైలుకు

ఇటీ వల వైద్యాధికారులు తొర్రూరులోని కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లలో తనిఖీలు చేసి ధరల పట్టిక, సరైన పరికరాలు లేకపోవడంతో వెంటనే సీజ్ చేశారు. అయితే, అక్రమంగా అబార్షన్ చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తొర్రూరులోని మురికికాలువలో 7 నెలల మృత శిశువు లభ్యమైంది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు వైద్యాధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వ లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎన్ని జరిగినా అధికారుల తీరు మారడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

దొరికేతేనే దొంగలు.. లేకుంటే దర్జాగా దందా

వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో విచ్చల విడిగా పలు హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్ల లో లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహించి ఆడ పిల్ల అని తెలియగానే గుట్టుగా అబార్షన్లు నిర్వహిస్తున్నారు. ఇంకా కొందరు వక్రమార్గంలో గర్భం దాల్చిన వారికి అందినకాడికి డబ్బులు దండుకుని గర్భస్రావాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ప్రాక్టీస్ చేసే కొందరు ఆర్ఎంపి, పీఎంపి వైద్యుల ద్వారా కొందరు దందా కొనసాగిస్తుండగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా అవసరం ఉన్న వారిని గుర్తించి ఈ దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని అమాయక ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు గర్భనిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలు కొనసాగిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

Also read: Telangana Govt: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉగాది నుండి కొత్త పథకం ప్రారంభం..

గతంలో పట్టుబడిన గుట్టుగా మళ్ళీ వ్యవహారం

వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని హనుమకొండ గోపాల్ పూర్ లోని ఓ హాస్పిటల్ గతంలో గర్భం నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యల రాకెట్ పెద్ద మొత్తంలో నిర్వహిస్తూ పట్టుబడిన ఆ కేసులో అమాయకులను పట్టుకుని అసలు వ్యవహారంలో కర్త కర్మ గా వ్యవహరించిన వారిని తప్పించారు అనే ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట లో మరియు హనుమకొండలో ప్రాక్టీస్ చేసే వైద్యురాలు అబార్షన్ నిర్వహిస్తూ బట్టుబడి హాస్పిటల్స్ సీజైనా ఇప్పుడు మళ్ళీ గుట్టుగా వ్యవహారం నడిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా నర్సంపేటలో ఈ వ్యవహారం ఎక్కువ మొత్తంలో కొనసాగుతుంది. గతంలో నిర్వహించిన వారు పట్టుబడిన తర్వాత కొంతకాలం నిలిపివేసిన మళ్లీ గర్భిణీత దారుణ పరీక్షలు అబార్షన్లు కొనసాగిస్తూనే ఉన్నారు.

వరంగల్ జిల్లా నెక్కొండ, మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు, కురివిలో ఈ వ్యవహారం కొనసాగుతుంది అనే సమాచారం. ఖమ్మం జిల్లా నుంచి ఓ మొబైల్ డయాగ్నసిస్ టీమ్ మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి గర్భనిర్ధారణ తర్వాత అబార్షన్ల కోసం కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ కు తరలిస్తూ భ్రూణహత్యలను ప్రోత్సహిస్తున్నారు. గతంలో మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు తాతియ తండాలో ఆర్ఏంపీ వైద్యుడు కొనసాగించిన దందా అప్పట్లో రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లా ఏటూరునాగారం లో ఓ ఆస్పత్రిలోను ఈ తతంగం నిరసిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. హన్మకొండలోని ఓ ప్రముఖ ప్రసూతి ఆస్పత్రిలోను స్మార్ట్ గా గర్భ నిర్ధారణ పరీక్షలు గర్భస్రావాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also read: Fire Accident: ప్రభుత్వ వైద్యశాలలో అగ్ని ప్రమాదం.. మందులు అగ్గిపాలు..

నామమాత్రపు పరిశీలనలు

గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ (లింగ ఎంపిక నిషేదం) 1994 నియమాలు 1996 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే అక్రమార్కులు వారి దందను విచ్చల విడిగా కొనసాగుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. రెండు సంవత్సరాల కాలంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలలో నెలలు నిండని మృతశిశువులు మురికి కాలువల్లో, చెత్త కుప్పల్లో, ముళ్ల పొదల్లో దర్శనం ఇచ్చిన హృదయ విదారక సంఘటనలు జరిగినా అధికారులు వాటిని అరికట్టడంలో నిర్లక్ష్యం వహించారు అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పకడ్బందీగా నిర్వహణను మెరుగుపరిచి గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అబార్షన్లు చేస్తున్న ఆసుపత్రులు ప్రైవేట్ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి