Sangareddy News: ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తనే చంపాలనుకుందో ఇల్లాలు. భర్తను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రించాలని ప్లాన్ వేసింది. కానీ చివరి నిమిషంలో కుట్రను పసిగట్టిన భర్త పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయట పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
మునిపల్లి మండలంలోని గోపులారం గ్రామ పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న కొమిశెట్టిపల్లి రవి అనే వ్యక్తిపై అతని భార్య హరిత హత్యయత్నం చేయించింది. ఆమె ప్రియుడు మిరుదొడ్డి సాయి ప్రదీప్ ,దాసోజు సాయికిరణ్ లతో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసింది. కొంతకాలంగా ప్రియుడితో సన్నిహితంగా ఉంటున్న హరిత.. భర్త అడ్డుతోలగించుకోవాలని భావించి అతన్ని చంపేందుకు కుట్ర పన్నింది. ఈ క్రమంలో భర్త ప్రయాణిస్తున్న వాహనాన్ని తారు వాహనంతో ఢీకొట్టి చంపించే ప్రయత్న చేసింది. అప్రమత్తమైన భర్త.. తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది.
viral: భార్యతో భర్త ఘర్షణ.. భార్య చేసిన పనికి అంతా షాక్
భర్త రవి ఫిర్యాదు మేరకు మునిపల్లి SI రాజేష్ నాయక్ కేసు నమోదు చేశారు. 24 గంటల్లో నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించారు. కట్టుకున్న భార్యే ఇంత దారుణానికి ఒడిగట్టడం పట్ల నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటివలి వరంగల్ జిల్లాకు చెందిన ఓ డాక్టర్ ను కూడా ఆయన భార్య చంపించడం కలకలం రేపింది. ప్రియుడి మోజులో పడిన భార్య అతనితో భర్తను చంపించింది. ఐరన్ రాడ్ తో మోదడంతో సదరు డాక్టర్ కొన్ని రోజుల పాటు ఉండి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
కాలం మారింది. రాయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించిన వాస్తవం ఇది. ఇటీవలి కాలంలో పురుషులపై మహిళల దాడులు జరుగుతున్న ఘటనలు నిత్యం నమోదవతుండటం ఆవేదన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం మీరట్ లో భార్య పుట్టినరోజు సందర్భంగా లండన్ నుంచి వచ్చిన భర్తను భార్య ముక్కలుగా నరికింది. ఆమె కూడా ప్రియుడితో కలిసే ఈ ఘాతుకానికి పాల్పడింది. వరంగల్ ఘటనలో డాక్టర్ అయిన భర్త.. ఆయన వృత్తిలో మంచి పేరు సంపాదించారు. భార్య తప్పుదారిలో వెళ్తుండటం గమనించి మందలించాడు. అయినా పద్దతి మార్చుకోని భార్య ఆయన లేకుండా చేయాలని హత్య చేయించింది.
అసలు వివాహేతర సంబంధాల వల్ల ఎంతటి అనర్థాలు జరుగుతాయి అనడానికి ఈ ఘటనలే ఉదాహారణలు. అక్రమ సంబంధాల వల్ల తీవ్ర పరిణామాలకు హత్యలకు దారి తీస్తున్న ఉదంతాలు నానాటికి పెరుగుతున్నాయి. మీడియాలో ప్రసారం అవుతున్నా, జైలు జీవితం అనుభవిస్తున్న వార్తలను నిత్యం చూస్తూ కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం మంచి పరిణామం కాదు.