Minister Bhatti Vikramarka(image credit:X)
Politics

Minister Bhatti Vikramarka: అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఎండగట్టిన భట్టి విక్రమార్క.. గత వైఫల్యాలపై ప్రశ్నల వర్షం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Minister Bhatti Vikramarka: గడచిన పదేండ్లలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలు అప్పులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుబారా చేసిందని, అసెంబ్లీ ఆమోదం లేకుండానే రూ. 2.30 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు కాగ్ సైతం ఎత్తిచూపిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అస్తవ్యస్తంగా తయారైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పని మొదలుపెట్టామన్నారు.

గతంలో రోజుకు 30 వేల టన్నుల ఇసుక విక్రయాలు జరిగేవని, రోజుకు కోటిన్నర ఆదాయం మాత్రమే వచ్చేదని, ఇప్పుడు నియంత్రణతో రెట్టింపు స్థాయిలో మూడు కోట్లు వస్తున్నదని, పదేండ్లలో రూ. 600 కోట్లు ఏమయ్యాయని వ్యాఖ్యానించారు. తాజా బడ్జెట్‌పై విపక్షాలు లేవనెత్తిన అంశాలకు క్లారిటీ ఇచ్చే సందర్భంగా పదేండ్లలో బీఆర్ఎస్ తప్పుడు విధానాలను ఎత్తి చూపారు.

Also Read: SLBC Tunnel Update: ఇంకా రిస్క్ ఉంది.. రెస్క్యూ కొనసాగుతోంది
పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మొత్తం రూ. 16.70 లక్షల కోట్లు ఖర్చయ్యాయని, కానీ రాష్ట్రానికి కొత్తగా వచ్చిన భారీ మౌలిక సౌకర్యాలేవీ లేవని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కండ్ల ముందే కూలిపోయిందని, అది మినహా నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు లాంటివి ఏవైనా కొత్తగా వచ్చాయా అని ప్రశ్నించారు.

Also read: Gaddam Prasad Kumar: ఆ ఒక్క కారణంతో.. పిల్లనివ్వడం లేదు.. స్పీకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
గత ప్రభుత్వం ఏనాడూ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని ఆరోపించిన భట్టి విక్రమార్క.. 2016-17లో రూ. 8 వేల కోట్లు ఖర్చు చేయలేని పరిస్థితి నుంచి 2023-24లో రూ. 58,571 కోట్ల స్థాయికి చేరుకున్నదన్నారు. చివరకు ఔటర్ రింగు రోడ్డును 30 ఏండ్ల కాలానికి కేవలం రూ. 7 వేల కోట్లకే అమ్ముకున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఒక జనరేషన్‌ యువత జీవితాన్నే నాశనం చేసిందని ఆరోపించారు.

CM Revanth Reddy – Harish Rao: రేవంత్ తో హారీశ్ భేటీ.. ఏం జరగబోతుంది?
పదేండ్ల కాలంలో ఆ ప్రభుత్వం చేసిన రుణమాఫీ రూ. 28,053 కోట్లేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీతో కలిపి మొత్తం రూ. 27 వేల కోట్లతో లబ్ధి చేకూర్చిందన్నారు. గతంలో ఏనాడూ వాస్తవిక బడ్జెట్‌ను బీఆర్ఎస్ ప్రవేశపెట్టలేదని, పదేండ్ల కాలంలో బడ్జెట్‌లో పేర్కొన్నా రూ. 3.21 లక్షల కోట్లు ఖర్చు చేయలేదన్నారు. పదేండ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు రూ. 8,19,151 కోట్ల అప్పుతో అప్పగించిందన్నారు. బడ్జెట్‌లో పూర్తి స్థాయి ఖర్చులు చేయనందువల్ల సంక్షేమ పథకాల కేటాయింపుల్లో కోత పడిందని, ఆ వర్గాల ప్రజలకు నష్టం జరిగిందన్నారు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..