SLBC Tunnel Update
తెలంగాణ

SLBC Tunnel Update: ఇంకా రిస్క్ ఉంది.. రెస్క్యూ కొనసాగుతోంది

SLBC Tunnel Update: ఎస్ఎల్బీసీ  ప్రమాదం జరిగి రేపటికి నెల రోజులు. ఫిభ్రవరి 22న నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో సొరంగంలోని 14వ కిమీ వద్ద ప్రమాదం జరిగింది. పై కప్పు కూలడంతో టన్నెల్ ను తవ్వడానికి వినియోగించే టన్నెల్ బోరింగ్ మిషన్(TBM) కూడా విరిగి ఏనిమిది మంది లోపలే చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తు ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

శుక్రవారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో,టన్నెల్ ప్రమాద ప్రదేశంలో నీ D 1, D 2, ప్రదేశాలలో సహాయక బృందాలు కొనసాగిస్తున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,అధికారులతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిపై , తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా చర్చించారు. సహాయక చర్యలు ప్రధానంగా టన్నెల్ బోరింగ్ మెషీన్  భాగాలను కత్తిరించడం, వాటిని తొలగించడం, అలాగే టన్నెల్‌లో చేరిన నీటిని బయటకు పంపించే విధానంపై కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. సహాయక బృందాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా చర్చించారు. టిబిఎం లోని కీలక భాగాలను ప్రత్యేకంగా కత్తిరించి, వాటిని తొలగించేందుకు అధునాతన యంత్రాలు ఉపయోగిస్తున్నామని, నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నామని తెలిపారు.

10th Class Hindi Paper leak: టెన్త్ పేపర్ లీక్ ప్రచారం.. స్పందించిన అధికారులు.. ఏం చెప్పారంటే?

టన్నెల్‌లో నిల్వ ఉన్న నీటితొ వాటర్ జెట్ ద్వారా బురదను తొలగించే ప్రక్రియ, ఎస్కా వేటర్ల ద్వారా మట్టిని కన్వేయర్ బెల్ట్ పై తరలించే ప్రక్రియపై వివరంగా చర్చించారు. సహాయక బృందాలకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నట్లు, అల్ట్రా థర్మల్ కట్టర్లతో టన్నెల్ బోరింగ్ మెషీన్ భాగాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలపై ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తూ, కొనసాగించవలసిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఉన్నతాధికారులు సహాయక బృందాల సేవలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సహాయక చర్యల వేగాన్ని పెంచినట్లు వివరించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారులు, కల్నల్ పరీక్షిత్ మెహర, వికాస్ సింగ్, ఎన్ డి ఆర్ ఎఫ్, అధికారులు డాక్టర్ హరీష్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్ డి ఆర్ ఎఫ్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ర్యాట్ హోల్ మైనర్స్, అన్వి రోబోటిక్స్ , కేరళ రెస్క్యూ బృందం, జే పి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళనను కలిగిస్తోంది. దాదాపు నెల రోజులుగా విపత్తు నిర్వహణ బృందాలు చెమటోడ్చుతున్నాయి. ఇంతా సుదీర్ఘంగా రెస్క్యూ కొనసాగడం విచారకరం. ప్రమాదం జరిగింది సొరంగంలో కావడం ప్రమాద తీవ్రత అధికంగా ఉండటం చేత రెస్క్యూ సవాల్ గా మారింది. తొలి రోజు నుంచి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సహాయక బృందాలు.. ఒక్కో అడ్డంకిని తొలగించుకుంటూ తీవ్ర పరిశ్రమ చేస్తున్నాయి.

అయినా రెస్క్యూ ఆపరేషన్ ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపించడం లేదు. మధ్యలో కడావర్ డాగ్స్ రంగంలోకి దిగడం.. డీ1, డీ2 పాయింట్ల వద్ద టీబీఎం ఆపరేటర్ మృతదేహాన్ని కనిపెట్టడంతో మిగతా మృతదేహాలు కూడా దొరుకుతాయని, త్వరలోనే ఆపరేషన్ ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ అలా జరగడం లేదు. రోబోలను కూడా టన్నెల్ లోకి దించినప్పటికీ సాంకెేతిక సమస్యలు తలెత్తాయి. ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది అనే స్పష్టతకు సహాయక బృందాలు రాలేకపోతున్నాయి. ఏదైమైనా రెస్క్యూ టీమ్స్ చేస్తున్న నిరంతర కృషికి మనం హాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు