తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: 10th Class Hindi Paper leak: పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజే ప్రశ్న పత్రం లీక్ అయిందని దుష్ప్రచారం చేయడంపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. ప్రశ్న పత్రం ఫొటోగ్రాప్ ను వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి కోందరు మంచి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వాట్సప్ ద్వారా సర్క్యులేట్ చేసి లీకేజీ అంటూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఇలాంటివి మరోసారి రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.
ఇదిలా ఉండగా టెన్త్ తొలిరోజు పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 4,94,887 (99.67 శాతం) మంది హాజరయ్యారు. కాగా 1662 మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 1353 మంది ఉండగా అందులో 1024 మంది హాజరయ్యారు. 329 మంది ఆబ్సెంట్ అయ్యారు.
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు