తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Gaddam Prasad Kumar: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ పై బీఆర్ఎస్ శాసన సభ పక్ష నేత హరీశ్ రావు మాట్లాడిన తర్వాత స్పీకర్ దేవర కొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ కు మాట్లాడే అవకాశమిచ్చారు.బాలు నాయక్ రానున్న ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ లో సర్కారు జరిపిన కేటాయింపులు, 16 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ది, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ వచ్చారు.
Also Read: Mulugu District News: నకిలీ మందులతో మోసం.. ఎట్టకేలకు గుట్టురట్టు చేసిన పోలీసులు..
హరీశ్ రావు ప్రస్తావించిన ట్రిబుల్ ఆర్ రింగ్ రోడ్డు కు గత బడ్జెట్ లో కేటాయింపులు జరిపి, పైసా కూడా విడుదల చేయలేదన్న విషయాన్ని బాలు నాయక్ ప్రస్తావిస్తూ, తమ దేవర కొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో కూడా రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిందని స్పీకర్ కు వివరిస్తూనే, సార్..మీది వికారాబాద్ జిల్లానే కదా, గ్రామాల్లో రోడ్ల పరిస్థతి మీకు బాగా తెలుసునని చెబుతుండగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ జోక్యం చేసుకుని అవును గ్రామాలకు రోడ్డు లేకపోతే చాలా మంది ఆ ఊరికి పిల్లను కూడా ఇవ్వటం లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యానించటంతో సభ్యులు చిరునవ్వులు చిందించారు.
Also Read: MLC Kavitha: స్పీడ్ పెంచిన కవిత.. ర్?టెన్షన్ లో హరీష్ రావు, కేటీఆర్
గ్రామాల్లోని రోడ్ల పరిస్థితిని ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రస్తావిస్తుండగానే మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి లేచి, అన్నిగ్రామాల్లో తమ హయాంలోనే పెద్ద రోడ్లను వేశామని సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా, బాలు నాయక్ జోక్యం చేసుకుని దేవర కొండ నుంచి నల్గొండ వరకు 60 కిలోమీటర్ల రోడ్డు ఎలా ఉందో చూద్దాం రండి, సభ ముగిసిన తర్వాత బండి తీసుకుని పోదామా? అంటూ నాయక్ వ్యాఖ్యానించగా, అంతలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జోక్యం చేసుకుని ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7 వేల కోట్లకు అమ్ముకున్న ఘనత గత సర్కారుకే దక్కిందని, ఎవరైనా రోడ్డును అమ్ముకుంటారా? అధ్యక్షా అని వ్యాఖ్యానించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈhttps://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు