MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల పార్టీ నాయకత్వాన్ని కూడా ఆశ్చర్యపరిచేలా స్వతంత్రంగా తన కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. తన స్వంత నిర్ణయాలతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీలో కీలక నేతగా ఉన్నా, ఆమె తాజాగా చేపట్టిన కార్యక్రమాలు హైకమాండ్‌తో సమన్వయం లేకుండా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, శాసన మండలిలో ఆమె వ్యవహరించిన తీరు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించి, జాతీయ స్థాయిలో మహిళా హక్కుల కోసం పోరాడారు. ఈ చర్యలు ఆమె స్వతంత్ర రాజకీయ ప్రస్థానాన్ని సూచిస్తున్నాయి. అయితే ఆమె స్వతంత్ర కార్యచరణను హరీశ్ రావు లేదా కేటీఆర్‌లకు చెక్ పెట్టడానికేనా? అనే ప్రశ్నలు ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
శాసన మండలిలో కవిత ధోరణి..
ఇటీవల శాసన మండలిలో కవిత ప్రవర్తించిన తీరును బట్టి ఆమె దూకుడుగా, స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సభలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను సమర్థించినప్పటికీ, కొన్ని అంశాల్లో ఆమె స్వతంత్రంగా మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఆమె ఇచ్చిన స్పందనలు, అధికార పక్షం, ఇతర సభ్యులను ఆశ్చర్యానికి గురి చేశాయి.
హరీశ్ రావుకు ప్రత్యామ్నాయంగా?
పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం.. కవిత ప్రస్తుతం హరీశ్ రావును అడ్డుకునేందుకు లేదంటే కేటీఆర్‌పై ఒత్తిడి తీసుకురావడానికిని ప్రయత్నిస్తున్నారు. హరీశ్ రావు అనుభవజ్ఞత, ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా, అతని రాజకీయ భవిష్యత్తు బలపడుతోందన్న భావన బీఆర్‌ఎస్‌లోని కొందరిలో ఉంది. ఈ క్రమంలో కవిత తీసుకుంటున్న స్వతంత్ర నిర్ణయాలు.. ఆమె శక్తిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నవేనని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. తద్వారా హరీశ్ రావుకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆమె భావిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
కేటీఆర్‌ను అడ్డుకోవడానికా..?
మరోవైపు కవిత తన ప్రత్యేక కార్యక్రమాలతో కేటీఆర్‌ను ఎదుర్కొనే ప్రయత్నంలో ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆమె ముందుగా జాతీయ స్థాయిలో బలమైన నాయకురాలిగా నిలబడాలనే ఆలోచనతో స్వతంత్రంగా రాజకీయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేటీఆర్ నాయకత్వంపై ఏదైనా ఒత్తిడి తీసుకురావడానికా? లేక తన రాజకీయ భవిష్యత్తును బలపరచుకోవడానికా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Naga Babu: నవ్విన చంద్రబాబు.. నాగబాబు లాజిక్ ట్వీట్
ప్రజల్లో ఎన్నో అనుమానాలు..
ప్రజలు కూడా కవిత తాజా రాజకీయ ఎత్తుగడలను ఆసక్తిగా గమనిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో మళ్లీ గ్రూప్ రాజకీయాలు మొదలైనట్లేనా? పార్టీ అధినేత కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నలు సామాన్య కార్యకర్తల నుంచి కూడా వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కవిత కీలక పాత్ర పోషించింది. కానీ ప్రస్తుతం ఆమె కేటీఆర్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ప్రయత్నంలో ఉందా? లేదా ఆమెకు తన ప్రత్యేక శక్తిని ప్రదర్శించుకోవాలనే ఉద్దేశమా? అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ కేటీఆర్, హరీశ్ రావు మధ్య కవిత కారణంగా ఏదైనా సంక్షోభం మొదలైతే, అది భవిష్యత్‌లో పార్టీపై తీవ్రం ప్రభావం చూపే అవకాశం ఉందని క్యాడర్‌లో చర్చలు వినిపిస్తున్నాయి.
అసలు లక్ష్యం ఏమిటో..
కవిత ప్రత్యేక కార్యచరణ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటన్నది సమకాలీన రాజకీయ పరిణామాలను బట్టి తేలాల్సి ఉంది. కానీ, పార్టీ నేతల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగినట్లయితే అది బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మారే అవకాశమే ఎక్కువ. ఆమె నిర్ణయాలు వ్యక్తిగతంగా రాజకీయంగా బలపడటానికి తీసుకున్నవా? లేక పార్టీలో తన హోదాను మరింత బలపరచుకోవాలనే వ్యూహమా? అన్నది రాబోయే రోజుల్లో తేలనున్నది.