Naga Babu: ఏపీ ఎమ్మెల్యేలకు 3 రోజుల పాటు ఆటల పోటీలు జరగడం తెలిసిందే. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొన్నారు. శుక్రవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు (CM Chandra Babu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalyan), స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Pathrudu) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రదర్శించిన కామెడీ స్కిట్ చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ నవ్వుతున్న ఫొటోలను షేర్ చేస్తూ మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర పోస్టు పెట్టారు.
నాగబాబు ఏమన్నారంటే
పవన్ సోదరుడైన నాగబాబు తాజాగా ఎక్స్ (Twitter) వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. విపక్ష వైకాపా అధికారంలో ఉండగా చంద్రబాబు జరిగిన అవమానం గురించి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘ఆ రోజు శాసన సభలో గౌరవనీయులైన సీఎం చంద్రబాబుకి జరిగిన అవమానంకి ఆయన కన్నీరు పెట్టటం ఎంత బాధించిందో అదే ఈ రోజు శాసన సభ కల్చరల్ ఈవెంట్ లో ఆయన మనస్పూర్తి గా నవ్వుతున్న దృశ్యం అంత ప్లెజెంట్ గా అనిపించింది. అలాగే పని ఒత్తిడిలో చాలా రోజులుగా నేను గమనిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మనస్ఫూర్తిగా నవ్విన నవ్వు చూసి నాకు చాలా సంతోషం వేసింది’ అని చెప్పుకొచ్చారు.
Read Also: High Security At Uppal Stadium: షురూ కానున్న ఐపీఎల్ సందడి.. రంగంలోకి మౌంటెడ్ పోలీసులు..
నాగబాబుకి వర్మ కౌంటర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతడి గెలుపులో పిఠాపురం టీడీపీ నేత వర్మ పాత్ర ఎంతో ఉందని పొలిటికల్ వర్గాల టాక్. ఈ క్రమంలో ఇటీవల జరిగిన జనసేన ప్లీనరి సభలో.. పవన్ గెలుపుతో ఎవరికీ సంబంధం లేదని అర్థం వచ్చేలా నాగబాబు మాట్లాడారు. పవన్ గెలుపు వెనక ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది వాళ్ల కర్మేనని నాగబాబు అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇందులో ప్రజలే నా బలం అంటూ ఓ భారీ స్లోగన్ పెట్టారు. అదే పోస్టర్ పై చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర కూటమినేతల ఫోటోలు కూడా పెట్టారు. అయితే ఈ ట్వీట్ ద్వారా వర్మ.. నాగబాబు, జనసేన పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది.