High Security At Uppal Stadium
స్పోర్ట్స్

High Security At Uppal Stadium: షురూ కానున్న ఐపీఎల్​ సందడి.. రంగంలోకి మౌంటెడ్​ పోలీసులు..

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: High Security At Uppal Stadium: ఐపీఎల్​ మ్యాచులు జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్​ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ కమిషనర్ సుధీర్​ బాబు తెలిపారు. బందోబస్తు విధుల్లో మొత్తం 2,700 మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. 18వ ఎడిషన్​ టాటా ఐపీఎల్​ మ్యాచులు ఈనెల 23 నుంచి ప్రారంభమై మే 20వ తేదీ వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. దీంట్లో కొన్ని మ్యాచులు ఉప్పల్​ లోని రాజీవ్​ గాంధీ స్టేడియంలో జరుగనున్నాయి. స్టేడియంలో 39 వేల సీటింగ్​ కెపాసిటీ ఉందని చెప్పిన కమిషనర్​ సుధీర్​ బాబు మ్యాచులు చూడటానికి జనం పెద్ద సంఖ్యలో వస్తారన్నారు.

ఈ నేపథ్యంలో చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అదే సమయంలో ఆటగాళ్ల భద్రత కోసం కూడా పకడ్భంధీ చర్యలు చేపట్టామన్నారు. బందోబస్తు విధుల్లో సెక్యూరిటీ వింగ్​, ట్రాఫిక్​ విభాగాలకు చెందిన 3‌‌00 మంది, లా అండ్​ ఆర్డర్​ కు చెందిన 1,218, తెలంగాణ స్టేట్​ స్​పెషల్​ పోలీస్​, ఆర్మ్​ డ్​ రిజర్వ్​ డ్​ విభాగాలకు చెందిన 12 ప్లటూన్లు, 2 ఆక్టోపస్​ బృందాలు, 10 మంది మౌంటెడ్​ పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారన్నారు. వీరితోపాటు స్పెషల్​ బ్రాంచ్​, సీసీఎస్, ఎస్వోటీ బృందాలు కూడా డ్యూటీలో ఉంటాయని చెప్పారు.

Also Read: Betting Suicide Cases: ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు.. బలైంది ఎందరో!

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్టేడియం వద్ద 10 వజ్ర వాహనాలు, 4 ఫైరింజన్లను స్టేడియం వద్ద మోహరిస్తున్నట్టు తెలిపారు. 1వ నెంబర్​ గేటు నుంచి కేవలం ఆటగాళ్లు, వీవీఐపీలను మాత్రమే అనుమతిస్తామన్నారు. మ్యాచ్​ చూడటానికి వచ్చే వారు తమ తమ టిక్కెట్లపై ఉన్న గేట్​ నెంబర్లు చూసుకుని వాటి ద్వారానే స్టేడియం లోపలికి వెళ్లాలన్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే స్టేడియం లోపల ఉండే ప్రేక్షకులను వీలైనంత త్వరగా బయటకు పంపించటానికి సన్నాహాలు పూర్తి చేసినట్టు చెప్పారు.

బందోబస్తు హైలైట్స్​… 

స్టేడియం బయట లోపల, వెహికిల్​ చెక్​ పాయింట్లు, పార్కింగ్​ ప్రాంతాల వద్ద 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. జాయింట్​ కమాండ్ కంట్రోల్​ సెంటర్​ ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా సిబ్బంది స్టేడియం బయట, లోపల ఏం జరుగుతుంన్నది పరిశీలిస్తుంటారు. ఏదైనా సమస్య తలెత్తితే బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందిని అలర్ట్​ చేసి పరిస్థితులు అదుపు తప్పకుండా చూస్తారు. బాంబ్ డిస్పోజల్​ స్క్వాడ్ల ద్వారా మ్యాచులు ఉన్న రోజుల్లో తనిఖీలు ఉంటాయి. ప్రతీ సబ్​ ఇన్స్​ పెక్టర్ కు వీహెచ్​ఎఫ్​ సెట్లను ఇస్తారు. దీని ద్వారా వేగంగా సమాచార మార్పిడికి అవకాశం ఉంటుంది.

స్టేడియం వద్ద స్కానర్స్​ ను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఎవరైనా పేలుడు పదార్థాలు తీసుకు వచ్చారా? నిషేధిత వస్తువులను స్టేడియం లోపలికి తీసుకెళుతున్నారా? అన్నది పరిశీలిస్తారు. పోలీసు జాగిలాలతో కలిసి బాంబ్​ డిస్పోజల్​ స్క్వాడ్లు మ్యాచ్ కు ముందు తనిఖీలు చేస్తారు. అవసరమైతే మ్యాచులు నడుస్తున్నపుడు కూడా చెక్​ చేస్తారు. అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెట్టటానికి ప్రత్యేక బృందాలు పని చేస్తుంటాయి. నలుగురు మొబైల్​ టెక్నీషియన్లు స్టేడియం లోపలికి వెళ్లే గేట్ల వద్ద ఉండి మ్యాచులు చూడటానికి వచ్చేవారి సెల్​ ఫోన్లను పరిశీలిస్తారు. మౌంటెడ్​ పోలీసులు స్టేడియం 1, 3, 4, 7, 8 గేట్ల వద్ద మోహరించి ఉంటారు.

Also Read: Koluvula Pandaga: అందాల పోటీలు నిర్వహిస్తే.. కడుపుమంట ఏల.. సీఎం రేవంత్ రెడ్డి 

మ్యాచ్​ చూడటానికి వచ్చే వారు తమ వెంట ల్యాప్​ టాపులు, బ్యానర్లు, వాటర్ బాటిల్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, ఎలక్ర్టానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, పర్ ఫ్యూంలు, బ్యాగులు, బయట దొరికే తినుబండారాలను తీసుకు రావటం నిషిద్ధం. మహిళల పట్ల ఎలాంటి వేధింపులు జరగకుండా చూసేందుకు షీ టీమ్స్ బృందాలు పని చేస్తుంటాయి. స్టేడియం లోపల ఆహార పదార్థాలు, శీతల పానీయాలను విక్రయించే వారు ఎక్కువ రేట్లకు వాటిని అమ్మకుండా చూడటానికి ప్రత్యేక బృందాలు ఉంటాయి.

స్పాన్సర్లు, తినుబండారాలు, శీతల పానీయాలు అమ్మేవారు తప్పనిసరిగా తమకు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డులను వెంటబెట్టుకోవాల్సి ఉంటుంది. జెన్​ ప్యాక్ట్ నుంచి ఉప్పల్​ రింగు రోడ్డు, ఉప్పల్ రింగు రోడ్డు నుంచి రామాంతాపూర్​ లోని విశాల్​ మార్ట్​ వరకు రోడ్డుకు ఇరుపక్కల వాహనాలను పార్క్​ చేయరాదు. మ్యాచ్​ ప్రారంభం కావటానికి 3 గంటల ముందు గేట్లను తెరుస్తారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే వైద్య సహాయం అందించటానికి 3 నుంచి 5 అంబులెన్సులను స్టేడియం వద్ద మోహరిస్తారు. ప్రేక్షకులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే తమ తమ వాహనాలను పార్క్​ చేయాలని తెలిపారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్