Konaseema district crime: మానవ సంబంధాలు నానాటికి మరింత దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు (Illigal Affairs) ప్రాణాలను నిలువునా బలిగొంటున్నాయి. రక్తసంబంధీకుల మధ్య సైతం చిచ్చుపెట్టి హత్యలు చేసేలా పురిగొల్పుతున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు, కూతుర్లను.. తల్లిదండ్రుల పాలిట కాలయముళ్లుగా మార్చేస్తున్నాయి. ఈ తరహా ఘటనే తాజాగా ఏపీలోని కోనసీమ జిల్లాల్లో జరిగింది. అక్రమ సంబంధం కోసం ఓ కసాయి కూతురు కన్న తండ్రిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది.
అసలేం జరిగిందంటే..
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar konaseema district)లో దారుణం చోటుచేసుకుంది. మండపేట టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి ఓ వివాహిత కన్నతండ్రినే అత్యంత దారుణంగా హత్య చేయించింది. పోలీసులు వివరాల ప్రకారం.. మండపేట మండలం మేదరిపేట ప్రాంతానికి సురా రాంబాబుకు వస్త్రాల వెంకట దుర్గ అనే కూతురు ఉంది. ఆమెకు గతంలోనే వివాహం కావడంతో భర్త, ముగ్గులు పిల్లలతో స్థానికంగా జీవించేది. ఈ క్రమంలో దుర్గకు రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ముమ్మిడివరపు సురేష్ తో పరిచయమైంది.
దూరం పెట్టిన భర్త
ముమ్మిడివరపు సురేష్ తో దుర్గకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది తెలుసుకున్న భర్త పలుమార్లు దుర్గను మందలించాడు. అయినప్పటికీ దుర్గలో మార్పు రాకపోవడంతో ఆమెను వదిలేసి దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ దుర్గ తీరులో మార్పు రాలేదు. అడ్డు చెప్పేవారు లేకపోవడంతో ప్రియుడితో ఆమె మరింత రెచ్చిపోయింది. దీంతో తండ్రి రాంబాబు దుర్గను గట్టిగా మందలించాడు. సురేష్ కు దూరంగా ఉండాలని కుమార్తెను హెచ్చరించాడు.
పక్కా ప్లాన్ ప్రకారం
వివాహేతర బంధానికి పదే పదే అడ్డువస్తుండటంతో కన్నతండ్రిపై దుర్గ పగ పెంచుకుంది. అతడ్ని ఎలాగైనా అడ్డుతప్పించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఈనెల 16న కొత్తూరులో ఉన్న ప్రియుడికి ఫోన్ చేసి తన తండ్రిని మట్టుబెట్టాలని దుర్గ సూచించింది. దీంతో ప్రియుడు సురేష్ తన స్నేహితుడితో కలిసి దుర్గ ఇంటికి వచ్చాడు. తండ్రి నిద్రపోతున్నాడని చెప్పడంతో నిందితుడు సురేష్.. రాంబాబు గుండెలపై కూర్చొని ఒకరు పీక నులిమాడు. స్నేహితుడు తాటికొండ నాగార్జున రెండు కాళ్లు పట్టుకొని డొక్కలో బలంగా తన్నడంతో తండ్రి రాంబాబు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: Harish Rao vs Komatireddy: హరీష్ వర్సెస్ కోమటిరెడ్డి.. అసెంబ్లీ వేదికగా పేలిన మాటల తూటాలు
ముగ్గురి అరెస్టు
తొలుత రాంబాబుది అనుమానస్పద మృతిగా భావించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. అనంతరం వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో రాంబాబుది హత్య అని తేలింది. దీంతో విచారణ చేపట్టిన మండపేట పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారమే అతడ్ని హత్య చేసినట్లు తేల్చారు. ఇందుకు కారణమైన కూతురు దుర్గతో పాటు ప్రియుడు సురేష్, అతడి స్నేహితుడ్ని అరెస్టు చేశారు. నిందితులను కోర్టుకు తలరించగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు టౌన్ సీఐ తెలిపారు.
Also Read This: Credit Card Fraud: మాయమాటలు నమ్మినందుకు.. రూ. 2 లక్షలు హాం ఫట్..