Credit Card Fraud (imagecredit:canva)
క్రైమ్

Credit Card Fraud: మాయమాటలు నమ్మినందుకు.. రూ. 2 లక్షలు హాం ఫట్..

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Credit Card Fraud: క్రెడిట్​ కార్డు డీ యాక్టీవేట్​ కాకుండా చూస్తానని గృహిణికి టోకరా ఇచ్చిన సైబర్​ క్రిమినల్స్​ 2.20 లక్షల రూపాయలు కొట్టేశారు. వివరాలు  లోకి వెలితే ఇలా ఉన్నాయి. హైదరాబాద్​ కు చెందిన ఓ గృహిణికి అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. మీ క్రెడిట్​ కార్డు డీ యాక్టీవేట్​ కానుంది. అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా చేయండంటూ ఓ యాప్​ లింకును పంపించాడు.

బాధితురాలు దానిపై క్లిక్ చేయగా ఓపెన్​ కాలేదు. అదే విషయాన్ని ఫోన్ చేసిన వ్యక్తికి చెప్పగా గూగుల్ క్రోంలోకి వెళ్లి తాను చెప్పిన యాప్​ ను ఓపెన్​ చేయమన్నాడు. అలాగే చేసిన బాధితురాలు యాప్​ ఓపెన్​ కావటంతో తన క్రెడిట్​ కార్డుతోపాటు ఇతర వివరాలను అప్​ లోడ్ చేసింది. ఆ వెంటనే ఆమె ఫోన్ ను హ్యాక్​ చేసిన అవతలి వ్యక్తి ఐసీఐసీఐ,  అమెరికన్ బ్యాంకుల్లో బాధితురాలి పేరున ఉన్న అకౌంట్ల నుంచి 2.20 లక్షలు డబ్బును ట్రాన్స్​ ఫర్​ చేశాడు.

Also Read: Sitarampur Man Suicide: వచ్చేది సరిపోదా? మరీ ఇంత కక్కుర్తి ఎందుకు? నెటిజన్స్ ఫైర్…

ఆ మేరకు ఆయా బ్యాంకుల నుంచి మెసెజీలు రావటంతో జరిగింది మోసమని గ్రహించిన బాధితురాలు వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్​ వర్గాలకు ఫోన్​ చేసి జరిగిన విషయం చెప్పి తన ఖాతా నుంచి నగదు బదిలీ కాకుండా చూడాలని చెప్పింది. దాంతోపాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు