AP Heatwave Alert (Images Source: X)
అమరావతి

AP Heatwave Alert: మండుటెండలతో జర భద్రం.. ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు

అమరావతి,స్వేచ్ఛ: AP Heatwave Alert: రానున్న మూడు మాసాలు అధిక ఉష్టోగ్రత, వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ కె.విజయానంద్ సూచించారు. వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజు రోజుకూ పెరుగతున్న ఉష్టోగ్రతలు,రానున్న రోజుల్లో సంభవించే వడగాల్పుల సన్నద్ధతపై గురువారం వివిధ శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.

Also read: CM Chandrababu: తిరుమలలో ఆ సమస్య రానివ్వను.. సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఎండ వేడిమి, వడగాల్పుల నుంచి కాపాడుకునేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రజల్లో తగిన అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సహా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Also read: AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్స్ చెక్ చేసుకోండి..

ముఖ్యంగా ఉపాధి కూలీలు పనిచేసే చోట్ల తాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రధమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం విద్యార్ధులకు పరీక్షలు జరుగున్నందున ఆయా పరీక్షా కేంద్రాల వద్ద తగిన తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని అన్నారు. నితరంత విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులను సీఎస్ ఆదేశించారు.

ఇలా చేయండి..

ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా ప్రజలు బయటికి వెళ్లొద్దు. ఎక్కువ ఎండలో తిరిగి వడదెబ్బ తగిలితే శరీరంలో నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. దాని వల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు నీటిని అధికంగా తీసుకోవడంతో పాటు తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

Also read: Pawan Kalyan: అన్నయ్యకు జీవిత సాఫల్య పురస్కారం.. ఆనందంలో తమ్ముడు!

ఎండ వేడిమి అధికంగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదు. పండ్లరసాలు తాగుతూ ప్రధానంగా శరీరం లవణాలను కోల్పోకుండా కాస్త ఉప్పు వేసిన ద్రవపదార్థాలు తీసుకోవాలి. వేసవిలో కూల్ డ్రింకులు కాకుండా కొబ్బరి బొండం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది’ అని రాష్ట్ర ప్రజలకు విజయానంద్ సూచించారు.

స్వేచ్ఛ పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?