తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: GHMC App: మీ ఏరియాలో, ఇంటి పరిసరాల్లో దోమల బెడద ఉందా? ఇక మీరు మున్సిపల్ ఆఫీసు చుట్టు చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. దోమల నివారణ కోసం జీహెచ్ఎంసీ చేస్తున్న ఫాగింగ్ కోసం మీరు మీ ఫోన్ లో మై జీహెచ్ఎంసీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, అందులో ఫాగింగ్ కావాలని రిక్వెస్ట్ పెడితే చాలు ఏకంగా మీ ఏరియాకు ఫాగింగ్ సిబ్బంది వచ్చేస్తుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
Also read: Swetcha Effect: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. మెట్రో రైళ్లపై ఇప్పుడే తొలగిస్తాం.. మెట్రో ఎండీ
దోమల నివారణ కార్యక్రమంగా భాగంగా చేస్తున్న ఫాగింగ్ ను కూడా డిజిటలైజ్ చేయటంలో భాగంగా తొలుత ఈ డిజిటల్ ఫాగింగ్ సిస్టమ్ ను జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నట్లు, ఫలితాలను బట్టి ఇతర సర్కిళ్లలో కూడా విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఫాగింగ్ చేసిన ప్రాంతాల్లోనే మళ్లీ ఫాగింగ్ రిపీట్ కావటం వంటి పరిణామాలకు బ్రేక్ వేయవచ్చునని, దీంతో దోమల నివారణ విభాగం ఎంటమాలజీ సిబ్బందికి సమయమే గాక, రసాయనాలు కూడా ఆదా అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఎక్కడ దోమల బెడద ఉందో అక్కడి నుంచి ఏ పౌరుడైన మై జీహెచ్ఎంసీ యాప్ లాగిన్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చునని, వారి లొకేషన్, రిక్వెస్ట్ ఆటోమేటిక్ గా ఆఫీసర్ కి చేరుతుందని, ఎంటమాలజిస్ట్ దాన్ని ఫాగింగ్ వర్కర్ కి అసైన్ చేస్తారని అధికారులు వివరించారు. ఆ తర్వాత ఫీల్డ్ లెవెల్ కి వెళ్లే సిబ్బంది ఫాగింగ్ చేస్తున్న ఫోటో లాటిట్యూడ్,లాంగిట్యూడ్ తో సహా అప్ లోడ్ చేసి పరిష్కారం అయిపోయిందన్న సమాచారాన్ని అప్ డేట్ చేస్తారని, ఈ సమాచారం రిక్వెస్ట్ చేసిన వారికి కూడా చూసుకునేలా యాప్ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
Also read: Hyderabad Development: జీహెచ్ఎంసీకి రికార్డు స్థాయి కేటాయింపులు.. ఇవిగో లెక్కలు!
జీహెచ్ఎంసీలో ఉన్న ఫాగింగ్ వర్కర్స్ కు తగినన్ని స్లాట్స్ అందుబాటులో ఉంటాయని, ఒకసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫాగింగ్ చేసిన ప్రాంతం నుంచి 100 మీటర్ల ప్రాంతం వరకు, వారం రోజుల వరకు వరకు ఆ ప్రాంతం నుంచి రిక్వెస్ట్ లను స్వీకరించబోమని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ ఫాగింగ్ ఆన్ రిక్వెస్ట్ ఫీచర్ ని మై జీహెచ్ఎంసి యాప్ లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.