Sunita Williams (image credit:Twitter)
అంతర్జాతీయం

Sunita Williams: సునీతా విలియమ్స్ కు వెల్ కమ్ అదుర్స్.. అతిథులను చూసి అంతా షాక్..

Sunita Williams: 9 నెలల తర్వాత భూమి మీదికి వచ్చిన సునీతా విలియమ్స్ కు ఫస్ట్ స్వాగతం పలికింది ఎవరో తెలుసా.. తెలుసుకుంటే ఆశ్చర్య పోవాల్సిందే. ఆ అతిథులను చూసి సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములు తెగ సంబర పడ్డారు. వారెవరు? మరీ అంత సంబరం ఎందుకో తెలుసుకుందాం.

2024, జూన్ 5న మరో వ్యోమగామి బారీ విల్మోర్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లారు. 9 రోజుల్లో వెనక్కు రావలసిన ఈ బృందం సాంకేతిక కారణాలతో 9 నెలలు అక్కడే ఉండిపోయారు. ఈ 9 నెలల కాలంలో వారు ఎదుర్కొన్న సమస్యలు చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. నాసా ఎట్టకేలకు క్రూ-10 మిషన్‌ ను ప్రయోగించి వారిద్దరినీ భూమి మీదికి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. గతంలో రెండు దఫాలు వీరిని భూమి మీదికి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక కారణాలతో ఆ ప్రయత్నం ఆగింది. చివరికి నాసా చేసిన మూడవ ప్రయత్నం విజయవంతమైంది.

అనుకున్నట్లుగానే సునీత, బుచ్ఐవిల్మోర్లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ తో గల క్రూ డ్రాగన్ వ్యోమనౌక తెల్లవారుజామున 3.27 గం.కు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా దిగింది. వెంటనే నాసా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చారు. రికవరీ వెస్సెల్ దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత క్యాప్సుల్ డోర్‌ను ఓపెన్ చేసి సునీతతో పాటు నలుగురు వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు.

అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు
జరిగాయని తెలిపింది. స్పేస్ ఎక్స్, నాసా సమష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని పేర్కొంది. ఈ యాత్రను విజయవంతం చేయడంలో స్పేస్ ఎక్స్ కీలకపాత్ర పోషించిందని ప్రశంసించింది. ఈ యాత్రలో సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారని వివరించింది.

Also Read: Sunita Williams: సునీతా విలియమ్స్ సేఫ్.. ఇదే లేకుంటే.. ఎప్పటికీ అక్కడే?

డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నీటిలో పడగానే..
డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నీటిలో పడగానే వ్యోమగాములకు విశిష్ట అతిథులు స్వాగతం పలికారు. 400 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కు ఉండే వేడి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అలా నీటిలో పడగానే, డాల్ఫిన్స్ అక్కడికి గుమికూడాయి. 9 నెలల తర్వాత భువి నుండి భూమి మీదికి వచ్చిన సునీతా విలియమ్స్ కు ముందు స్వాగతం పలికింది డ్రాగన్స్ కావడం విశేషం. సముద్రాలలో, నదులలో ఉండే క్షీరదంగా గుర్తించబడ్డ డాల్ఫిన్స్ గుమికూడడంతో అందరూ స్తంభమాశ్చర్యాలకు లోనయ్యారు. అలాగే బయటకు వచ్చిన వ్యోమగాములు సైతం వాటిని చూసి వెల్ కమ్ అదిరిందంటూ చిరునవ్వులు చిందించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!