Sunita Williams: సాంకేతిక కారణాల వల్ల 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యొమగామి(Astronaut) సునీతా విలియమ్స్, ఆమె సహచర వ్యొమగామి బుచ్ విల్మోర్(Barry Wilmore) ఎట్టకేలకు భూమికి పయనమయ్యారు. మరికొన్ని గంటల్లో వారు దివి నుంచి భువికి చేరుకోనున్నారు. వారి రాక కోసం 9 నెలలుగా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచ ప్రజలు, ముఖ్యంగా భారతీయులు ఈ వార్త విని సంతోషపడుతున్నారు. సంబురాలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు.
ఇదిలావుంటే.. గత ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్‌లో సునీతా, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి(International Space Station) వెళ్లారు. అదే నెల 14వ తేదీన వారు అక్కడి నుంచి తిరిగి రావాల్సింది. కానీ హీలియం గ్యాస్ లీకేజీ తదితర సాంకేతిక కారణాల వల్ల రాలేదు. మరి 9 రోజుల కోసం వెళ్లి 9 నెలలు అక్కడే ఉన్న సునీతా విలియమ్స్ ఇన్నాళ్లు ఎలా ఉండగలిగింది? ఏం తిన్నది? లాంటి విషయాలు తెలుసుకుందాం.
నాసా డైట్
అంతరిక్షం(Space)లో సునీతా విలియమ్స్ తీసుకునే ఆహారాన్ని కేవలం ప్రాణాలు నిలుపుకోవడం కోసమే అని కాకుండా మైక్రో గ్రావిటీ(సూక్ష్మగురుత్వాకర్షణ)లో ఉన్న పరిస్థితులును తట్టుకునే విధంగా నాసా రూపొందించింది. ఎక్కువ కాలం మైక్రో గ్రావిటీ(Micro Gravity) ఉండటం అనేది అనేక సవాళ్లతో కూడుకున్న అంశం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకునే ఆమె డైట్ పైన నాసా(NASA) ప్రత్యేక శ్రద్ధ వహించింది.సో.. మరీ స్పెస్ స్టేషన్ లో ఉండవలసి వచ్చిన ఈ 9 నెలల కాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంది, ఆమె డైట్ ఏంటీ? ఎదుర్కున సవాళ్లు ఏంటీ? పరిశీలిద్దాం.
అంతరిక్షంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే అంత ఈజీ కాదు. అన్ని రకాల పోషకాలు సరైన స్థాయిల్లో అందేలా చూసుకోవాలి. అందుకు అనుగుణంగా ఉండేలా సునీతా డైట్ ఉండేలా నాసా(Nకు చెందిన డైటీషియన్లు జాగ్రత్త వహించారు. ముఖ్యంగా పలు అంశాలపై ఎక్కువ ఫోకస్ చేశారు.
అంతరిక్ష ప్రయాణం కాల్షియం క్షీణతకు దారితీస్తుంది. ఎముకల సాంద్రతకు నష్టం చేకూరుస్తుంది. అందువల్ల సునీతా విలియమ్స్ తీసుకునే ఆహారంలో రిచ్ కాల్షియమ్స్ ఉండేలా చూసుకున్నారు. అలాగే విటమిన్ డి, పాస్పరస్ లాంటివి కూడా సమృద్ధిగా ఉండేలా డిజైన్ చేసుకున్నారు. వ్యొమగాముల కండరాలు క్షీణతకు గురి కాకుండా ఉండాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ సమృద్ధిగా అందితే కండరాల మెయింటెనెన్స్ కు ఉపయోగపడుతుంది.
స్పెస్ ట్రావెల్ లో తలెత్తే మరో సమస్య రేడియేషన్. శరీరాన్ని రేడియేషన్ నుంచి కాపాడేందుకు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఎక్స్‌పోజర్ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి కాబట్టి డైట్ లో ఉండేలా చూసుకున్నారు. అలాగే ఇమ్యూనిటీ కూడా కీలకం కాబట్టి విటమిన్ సి, జింక్ అలాగే ప్రోబయోటిక్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చారు.
రోజు తినేవి ఇవే..
అంతరిక్షంలో నచ్చిన భోజనం, వెరైటీలు చేయడం కుదరవని తెలిసు. అయినా 200కు పైగా ప్రీ అప్రూవ్డ్ ఫుడ్స్ ను వ్యోమగాముల కోసం నాసా ఏర్పాటు చేసింది. ఉదయం అల్పహారంలో రీహైడ్రేట్ చేయగల స్క్రాంబుల్డ్ గుడ్లు, ఓట్ మీల్ లేదా గ్రానోలా తీసుకుంటారు. అలాగే ప్రత్యేకంగా రూపొందించిన పౌచ్‌లలో క్రీమ్, చక్కెరతో చేసిన కాఫీ తాగుతారు. ఇక, లంచ్ లో.. పీనట్ బట్టర్, హమ్మస్ లేదా చికెన్ తో టోర్టిల్లాలు తింటారు. అంతరిక్షంలో తేలుతాయి కాబట్టి బ్రెడ్ వాడకం కుదరదు. వీటితో పాటు ప్యాక్ చేసిన సూప్‌లు లేదా పాస్తా లాంటివి తీసుకుంటారు. ఇక,
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ప్యాక్ చేసిన ట్యూనా చేప లేదా సాల్మన్ చేపను తింటారు.
డిన్నర్ లోకి అన్నంతో పాటు కూరగాయలు లేదా చికెన్ వినియోగిస్తారు. హాట్ సాస్ వంటి స్పైసీ సాస్‌లు తీసుకుంటారు. ఇక ఇవిగాక, శక్తిని పెంచడానికి నట్స్, ట్రైల్ మిక్స్, ప్రోటీన్ బార్‌లు, డార్క్ చాక్లెట్ వంటివి స్నాక్స్ దాంతో పాటు ఎముకలు, కండరాల బలం కోసం కాల్షియం, విటమిన్ డి, ఐరన్ సప్లిమెంట్లు వాడతారు. దాహం తీరడానికి మూత్రాన్ని రీ సైకిల్ చేసి అదే నీటిని తాగుతారు. డి హైడ్రేషన్ కాకుండా ఎలక్ట్రోలైట్ లు సేవిస్తారు. అంతరిక్షంలో వంట చేసుకోలేం కాబట్టి చాలా వరకు ఫ్రీజ్ డ్రై ఫుడ్ లేదా థర్మో స్టెబిలైజ్డ్ ఫుడ్ ను వినియోగిస్తారు.