ఎల్బీనగర్, స్వేచ్ఛ : Hyderabad News: పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని లోడ్ చేస్తున్న లారీతో పాటు గోదాంను పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. హయత్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. హయత్ నగర్ కి చెందిన పెట్రోలింగ్ పోలీసులు ఆదివారం పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలో గస్తీ నిర్వహిస్తున్నారు.
పెద్ద అంబర్ పేట నుంచి మునగనూరు వెళ్లే దారిలో ఒక పాత గోదాం ఎదుట లారీలో (TS3T5049) ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన పీడీఎస్ రైస్ లోడ్ చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే హయత్ నగర్ ఎస్సై వెంకట్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డి, డ్రైవర్ సురేశ్ అక్కడికి వెళ్లి, తనిఖీ చేశారు. అప్పటికే లారీలో 30 టన్నుల పీడీఎస్ రైస్ లోడ్ చేశారు.
Also Read: Ram Charan: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో.. ఆ శ్వాగ్‌కి ఫిదా కావాల్సిందే!
ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తాన్ బాగ్ కు చెందిన డ్రైవర్ రేకుల శివకుమార్, బియ్యం సేకరించిన హయత్ నగర్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన కాట్రోతు తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లారీని సీజ్ చేశారు. పెద్ద అంబర్ పేటలోని పాడుపడిన గోదాంలో నిల్వ చేసిన 6 నుంచి 7 టన్నుల పీడీఎస్ రైస్ ను గుర్తించారు. ఈ మేరకు అట్టి గోదాంకు తాళం వేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించినట్లు హయత్ నగర్ పోలీసులు తెలిపారు.