Global Star Ram Charan (Image Source: Twitter X)
ఎంటర్‌టైన్మెంట్

Ram Charan: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో.. ఆ శ్వాగ్‌కి ఫిదా కావాల్సిందే!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకులని అలరించకపోయి ఉండవచ్చు. కానీ ఆయన హీరోయిజంలో ఏ మాత్రం చేంజ్ రాలేదు. గ్లోబల్ గుర్తింపుకేం ఢోకా తేలేదు. ప్రస్తుతం బుచ్చిబాబు సానాతో చేస్తున్న ‘RC16’తో అన్ని లెక్కలు సరిచేస్తాననేలా, ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఆ సినిమా షూట్‌లో పాల్గొంటున్నారు రామ్ చరణ్. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న వార్తలు, సినిమాపై భారీ అంటే భారీ‌గా అంచనాలను సెట్ చేస్తున్నాయి.

అలాగే బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) టాలెంట్ ఏంటో కూడా ఒకే ఒక చిత్రంతో జనాలకు తెలిసిపోయింది. సుకుమార్‌కు శిష్యుడాయన. ఈ సినిమాకు ఆయన యాడ్ చేసుకుంటున్న క్యాస్ట్ అండ్ క్రూ కూడా మాములుగా లేదు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్, కీలక పాత్రలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సంగీతం ఏఆర్ రెహమాన్.. ఇలా ప్రతీది ది బెస్ట్ ఉండేలా చూసుకుంటున్న దర్శకుడు.. కథ డిమాండ్ మేరకే అంటూ సమాధానమిస్తున్నారు. బుచ్చిబాబు కాన్ఫిడెంట్ చూసి మెగాభిమానులు కూడా.. ఈసారి ఒక్కొక్కడికి ఇచ్చి పడేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Samantha: మళ్లీ సెలైన్.. సమంతకి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్!

ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ మేకోవర్ చూస్తే ముచ్చటేస్తుంది. గ్లోబల్ స్టార్ రేంజ్ ఇది అనేలా రామ్ చరణ్ ఎక్కడ కనిపించినా క్షణాల్లో ఆ ప్రదేశం జనసందోహంగా మారిపోతుంది. కాసేపటికే ఆ ఫొటోలు వైరల్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ గ్లోబల్ స్టార్ నడిచి వెళుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఈ ఫొటోలో రామ్ చరణ్ లుక్‌ని, శ్వాగ్‌ని చూసిన వారంతా.. ఫిదా అవుతున్నారు. అలా ఉన్నాడీ ఫొటోల్లో రామ్ చరణ్.

ఈ ఫొటోల్లో రామ్ చరణ్‌ని చూసిన వారంతా.. వావ్ ఏమున్నాడ్రా బాబూ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే.. బుచ్చిబాబు ఏం ప్లాన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. వైట్ షర్ట్, జీన్స్ ఫ్యాంట్, హెయిర్ స్టైయిల్, గడ్డం, గ్లాసెస్.. ఇలా ప్రతీది రామ్ చరణ్ లుక్ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలతో రామ్ చరణ్ పేరు ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ ఫొటోలను లైక్స్, షేర్స్‌తో వైరల్ చేస్తున్నారు.

Also Read- VC Sajjanar: అన్ ఫాలో కొట్టండి.. సజ్జనార్ యుద్ధం చేస్తే ఇలానే ఉంటుంది!

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ తనేంటో, తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన టైమ్ వచ్చింది. వాస్తవానికి ‘గేమ్ చేంజర్’తోనే అది ప్రూవ్ కావాల్సింది కానీ, ఆ సినిమాను శంకర్ మరో సినిమాతో కలిసి చేయాల్సి రావడంతో పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అయినా అందులోని కంటెంట్ పరంగా విమర్శలు వచ్చాయి కానీ, యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. అయినా ఆ సినిమా సరిపోదు. సాలిడ్ ఎంట్రీతో.. గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదని చాటే సినిమా ప్రస్తుతం చరణ్ నుంచి రావాలి. దాని కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. అది కచ్చితంగా ‘RC16’ అనే అంతా నమ్ముతున్నారు. చూద్దాం.. మరి ఏం జరగబోతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు