VC Sajjanar (Image Source: Twitter X)
ఎంటర్‌టైన్మెంట్

VC Sajjanar: అన్ ఫాలో కొట్టండి.. సజ్జనార్ యుద్ధం చేస్తే ఇలానే ఉంటుంది!

VC Sajjanar: ‘ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అని ‘పోకిరి’ సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఏదైనా పట్టుకున్నారంటే.. అది ఒక యుద్ధంలా మారిపోతుంది. ఆయన చేసే యుద్ధం సమాజ హితం కోసం. ప్రస్తుతం ఆయన బెట్టింగ్ మహమ్మారిపై యుద్ధం ప్రకటించి, అందులోని మూల పురుషులైన ఒక్కొక్కరిని బయటికి తీసుకువస్తున్నారు.

‘ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీస్తోన్న బెట్టింగ్ మహమ్మారిని అరికట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటే, మనమంతా కలిసి సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుదాం.. అనేక మంది ప్రాణాలను కాపాడుదాం’ అంటూ ఇప్పటికే పిలుపునిచ్చిన సజ్జనార్.. ‘బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు మన చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

Also Read- Pushpa 3: ‘పుష్ప 3’ విడుదల ఎప్పుడంటే.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త!

మీ ప్రాంతంలో ఎవరైనా కనిపిస్తే, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. వారి అక్రమ ప్రచారం అనేక మందిని సంక్షోభానికి గురిచేస్తోంది.. ఇది ఆపాల్సిన అవసరం ఉంది..’ అంటూ ఒక్కొక్కరినీ ఏరిపారేస్తున్నారు. లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్.. ఇప్పుడు టార్గెట్ హర్ష సాయి అన్నట్లుగా సోషల్ మీడియాలో సజ్జనార్ యుద్ధం స్టార్ట్ చేశారు. హర్ష సాయిపై నమోదైన కేసు వివరాలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు

ఈ మేరకు ఆయన చేసిన ఓ పోస్ట్‌లో హర్ష సాయి మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసి.. ‘‘చేస్తున్న‌దే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టుగా ఏవిధంగా గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కపోతే.. ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు. ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు బలవుతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన సంబంధం లేదు.

ఈయ‌న‌కు 100 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతగా డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్‌ని మార్కెట్‌లో పెట్టి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ల‌నా.. మీరు ఫాలో అవుతోంది. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి’’ అని పోస్ట్ చేశారు.

Also Read- Vishwaksen: హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ.. 20 నిమిషాల వ్యవధిలోనే అంతా..!

మరో పోస్ట్‌లో ‘బెట్టింగ్ యాప్‌లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్‌ స‌మాజంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతోంది. భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను కూడా దెబ్బ‌తీస్తోంది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్ళు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా? సమాజహితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా!?

ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్‌లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్‌ల వల్ల నష్టపోతే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి..’. ఇలా వరుస ట్వీట్స్‌తో సజ్జనార్ జనాల్లో, నెటిజన్లలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన ప్రయత్నానికి మనం కూడా చేతులు కలుపుదామా! అయితే మనం చేయాల్సింది ఒక్కటే.. ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను సజ్జనార్ చెప్పినట్టుగా అన్ ఫాలో చేస్తే చాలు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు