Vishwaksen
ఎంటర్‌టైన్మెంట్

Vishwaksen: హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ.. 20 నిమిషాల వ్యవధిలోనే అంతా..!

Vishwaksen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇంట్లో భారీగా చోరి జరిగినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్, రోడ్ నెంబర్ 8లో ఉన్న తమ ఇంటిలో చోరి జరిగినట్లుగా విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో నివాసం ఉంటుంది. విశ్వక్ సోదరి వన్మయి బెడ్ రూమ్‌లో ఆదివారం ఉదయం వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో, అనుమానం వచ్చిన వన్మయి వెంటనే తన తండ్రికి విషయం చేరవేసింది. వెంటనే తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఆ గదికి వెళ్లి చూడగా, గదిలోని వస్తువులన్నీ ఎక్కడపడితే అక్కడ పడి వుండటంతో పాటు, అల్మరాలు కూడా తెరిచి వున్నట్లుగా గమనించి, ఇంట్లో చోరి జరిగిందనే నిర్ధారణకు వచ్చి, వెంటనే పోలీసులకు విషయాన్ని తెలియజేశారు.

Also Read- AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌కు ఏమైంది? అస్వస్థతకు కారణం అదేనా?

అల్మరాలో కొన్ని బంగారు అభరణాలు ఉండాలని, అవన్నీ మాయమయ్యాయని పోలీసులకు విశ్వక్ తండ్రి చెప్పడంతో.. వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అంతకు ముందు ప్రాథమిక ఆధారాల నిమిత్తం క్లూస్ టీమ్‌తో గది అంతా పరిశీలించారు. కొన్ని ఆధారాలు, వేలిముద్రలు సేకరించిన అనంతరం.. సీసీటీవీ ఫుటేజ్‌ని చెక్ చేశారు. అందులో తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల సమయంలో.. ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి, గేటు తీసుకుని నేరుగా విశ్వక్ సేన్ ఇంటి మూడో అంతస్తుకు వెళ్లినట్లుగా గమనించారు. మూడో అంతస్తులోని వెనుక డోర్ నుంచి, వన్మయి బెడ్ రూమ్‌లోకి వెళ్లి, అల్మారాలో ఉన్న బంగారు ఆభరణాలను చోరి చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

కేవలం 20 నిమిషాల్లోనే..
5 గంటల 50 నిమిషాలకు ఇంటిలోకి చొరబడిన ఆ గుర్తు తెలియని వ్యక్తి, 20 నిమిషాల అనంతరం అంటే, 6 గంటల 10 నిమిషాల సమయంలో బయటికి వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గమనించారు. ఈ 20 నిమిషాల్లోనే.. విలువైన వస్తువులన్నీ, ముఖ్యంగా అల్మారాలో ఉన్న బంగారు అభరణాలన్నింటినీ చోరి చేశాడు. అందులో రెండు డైమండ్ రింగులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చోరీకి గురైన ఆభరణాల విలువ రూ. 2 కోట్ల 20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో విశ్వక్ సేన్ తండ్రి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు, చోరి అనంతరం దర్జాగా దొంగ వెళ్లడం చూసిన పోలీసులు, ఇదెవరో తెలిసిన వారి పనే అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి, దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా సమాచారం.

Also Read- The Suspect: క్షణం చూపు తిప్పుకోనివ్వని క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్‌కు రెడీ!

విశ్వక్ సేన్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఆయన నటించిన ‘లైలా’ సినిమా విడుదలై, బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. ఆ సినిమా తర్వాత, ఇకపై తన నుండి మంచి సినిమాలు వస్తాయని, ‘లైలా’ విషయంలో వస్తున్న విమర్శలను స్వీకరిస్తున్నానని తెలిపారు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తానని అభిమానులకు మాటిచ్చారు. మంచి, చెడు కాలాల్లో తనని నమ్మిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు