Samantha (Image Source: Samantha Instagram Post)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: మళ్లీ సెలైన్.. సమంతకి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్!

Samantha: ‘శాకుంతలం’ సినిమా టైమ్‌లో డబ్బింగ్ చెప్పడానికి కూడా ఓపిక లేక, చేతికి సెలైన్‌తోనే ఆ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసింది సమంత. అప్పట్లో ఆమె అలా చేతికి సెలైన్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలు ఎలా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. అందరూ ఆమెపై సింపతీని ప్రదర్శించారు. విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ టైమ్‌లోనూ ఆమె ఇబ్బంది పడుతూనే యాక్ట్ చేసింది.

‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాల తర్వాత ఇకపై కొన్నాళ్లపాటు సినిమాలు చేయనని చెప్పేసిన సమంత, అమెరికాకు తనకున్న మయోసైటీస్ చికిత్స నిమిత్తం వెళుతున్నట్లుగా పేర్కొంది. సినిమాలు చేయకపోయినా, ఆ గ్యాప్‌లో తను ఏం చేస్తుందీ వరసగా సోషల్ మీడియాలో తెలియజేస్తూనే వచ్చింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ‘సిటాడెల్- హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న సమంత.. ఈ మధ్య కాస్త యాక్టివ్‌గా కనిపిస్తుంది.

Also Read- Pushpa 3: ‘పుష్ప 3’ విడుదల ఎప్పుడంటే.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త!

సోషల్ మీడియాలో కూడా తనకున్న మయోసైటిస్‌పై విజయం సాధిస్తున్నట్లుగానే చెప్పుకొచ్చింది. తనలాంటి వారందరికీ ఎంతో స్ఫూర్తినిస్తూ వస్తుంది. మరి ఏమైందో ఏమో.. మళ్లీ చేతికి సెలైన్‌తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలలో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించిన సమంత, ఆ ఫొటోల్లోని ఒక ఫొటోలో ఇలా సెలైన్‌ పెట్టుకుని దర్శనమిచ్చింది. అయితే ఆమె నవ్వుతూనే ఈ ఫొటోలో కనిపిస్తుండటం విశేషం.

">

నటిగా సినిమాలను చాలా వరకు తగ్గించేసిన సమంత, కేవలం వెబ్ సిరీస్‌లు మాత్రమే చేస్తుంది. తాజాగా ఆమె నటించిన ‘సిటాడెల్- హనీ బన్నీ’ విడుదలవగా, అదే టీమ్‌తో ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. రీసెంట్‌గానే మళ్లీ ఆమె టాలీవుడ్‌లో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అందులో భాగంగా ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుందని వార్తలు నడుస్తున్నాయి. మరోవైపు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆమె సిద్ధమైంది.

‘త్రాలాల మూవింగ్ పిక్చర్స్’ పేరుతో బ్యానర్ స్థాపించిన సమంత.. అందులో మొదటి చిత్రంగా ‘శుభం’ అనే సినిమాను చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా తెలుపుతూ, శనివారమే అప్డేట్ ఇచ్చారు. ఆ ఫొటోలను కూడా సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. మరి ఇంత ఆనందంగా ఉన్న సమయంలో సడెన్‌గా సెలైన్‌తో కనిపించడంతో.. ఇంకా ఆమెకు మయోసైటీస్ తగ్గలేదా? ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉందా? అనేలా ఆమె అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఆందోళన చెందుతున్నారు. మరి దీనిపై సమంత మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కేవలం ‘రికవరీ’ అని మాత్రమే తెలిపింది.

Also Read- VC Sajjanar: అన్ ఫాలో కొట్టండి.. సజ్జనార్ యుద్ధం చేస్తే ఇలానే ఉంటుంది!

మరోవైపు ఆమె కూడా తన ఎక్స్ హస్బెండ్ నాగచైతన్యలా రెండో పెళ్లి చేసుకోబోతుందనేలా ఈ మధ్య వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తను చేస్తున్న వెబ్ సిరీస్ చిత్రాల దర్శకులలో ఒకరితో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. ఈ వార్తలపై కూడా ఆమె ఎక్కడా స్పందించలేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు