DK Aruna(image credit:canva)
క్రైమ్

DK Aruna: బిజెపి ఎంపీ ఇంట్లో చోరీకి యత్నం.. కిటికీ నుండి చొరబడి..

తెలంగాణ బ్యూరోస్వేచ్ఛ:DK Aruna: బీజేపీ ఎంపీ డీ.కే. అరుణ ఇంట్లోకి శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ దొంగ చొరబడ్డాడు. ఓ బెడ్​ రూంతో పాటు ఇంట్లో దాదాపు అరగంటపాటు కలియ తిరిగాడు. ఇక వివరాలోకి వెలితే జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్​ 56లోని బీజేపీ ఎంపీ డీ.కే. అరుణ ఇంటికి శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ దొంగ ఇంట్లోకి దూరాడు. ఇంటి ప్రహారీగోడపై నుంచి దూకి లోపలికి ప్రవేశించిన ఆ దుండగుడు వంట గదిలోకి వెల్లి అక్కడ ఉన్న కిటికీ తెరిచి ఇంట్లోకి చొరబడ్డాడు.

లోపలికి వెల్లిన అతడు హాల్​ తోపాటు ఓ బెడ్రూం తలుపులు తెరిచి ఇంట్లోని విలువైన వస్తువులు సొత్తు కోసం వెతికాడు. కాని ఏమీ దొరకక పోవటంతో అరగంట సేపు అక్కడే తిరిగి తరువాత వచ్చిన దారినే తిరిగి మల్లి పరారయ్యాడు. చోరికి ప్రయత్నించిన ఆ సమయంలో డీ.కే. అరుణ తన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్​ నగర్​ లో ఉన్నారు.

Also Read: Sathya Sai District News: ఆర్టీసీ బస్సును హడలెత్తించిన మందుబాబు.. బస్సు కిందికి వెళ్లి.. ఏం చేశాడంటే?

ఆమె కూతురు ఇంట్లోనే ఉన్నా నిద్రలో వున్నందున మెలకువ రాక పోవటంతో దొంగ వచ్చిన విషయాన్ని గమనించలేక పోయిందని పోలీసులు చెప్పారు. ఈ సంగటన తెలిసిన వారే చోరీకి ప్రయత్నం చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో డీ.కే. అరుణ ఇంట్లో గతంలో పని చేసి మానేసినవ్యక్తులు వారి వివరాలు సేకరిస్తున్నారు. జూబ్లీహిల్స్​ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: New Schemes In TG: సరికొత్త పథకాలతో.. తెలంగాణ సర్కార్ ప్లాన్.. అవేమిటంటే?

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?