Sangareddy Crime
క్రైమ్

Sangareddy Crime: చోరీకి వెళ్లాడు.. ప్రాణాలు వదిలాడు

స్వేఛ్చ జోగిపేటః Sangareddy Crime: కేబుల్‌ వైర్లను దొంగిలించడానికి వెళిన్ల జోగిపేట పట్టణానికి చెందిన చిత్తారి సంగమేశ్‌ (30) అనే వ్యక్తి మృత్యువాత పడ్డ సంఘటన సంగారెడ్డి జిల్లా అందోలు శివారులో శనివారం రాత్రి జరిగింది. కొక్కొండ జగదీశ్‌ అనే రైతు తన వరి పొలానికి నీరు పారబెట్టడానికి ఆదివారం ఉదయం పొలం వద్దకు రాగా బోరు వద్ద కరెంటు సరఫరా లేకపోవడం, కేబుల్‌ను ఎవరో ఎత్తుకెళ్లారని గుర్తించి వెళుతుండగా రమేశ్‌ కౌలుకు తీసుకున్న భూమి దగ్గర కరెంటు బోర్డు వద్ద పడి ఉన్న యువకుడి మృతదేహన్ని చూసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also read: The Suspect: క్షణం చూపు తిప్పుకోనివ్వని క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్‌కు రెడీ!

సీఐ అనీల్‌కుమార్, ఏఎస్‌ఐ గౌస్‌ పోలీసు సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించగా కూలీ పనిచేసుకొని జీవించే వాడని గుర్తించారు. బోరు వద్ద గల ప్యానెల్‌ బోర్డు స్విచ్ తీసేసి కేబుల్‌వైరును కటింగ్‌ ప్లేర్‌తో కట్‌ చేయగా మెడకు కరెంట్‌షాక్‌ తగలడంతో తల కొద్ది భాగం తెగిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో దొంగిలించిన కేబుల్‌ వైరు సంచి సంగమేష్ మృతదేహం ప్రక్కనే ఉంది. దీనిని బట్టి చోరీకి వచ్చి కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జోగిపేట ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తులో అసలు విషయం వెల్లడి కావాల్సి ఉంది.

Also read: Sathya Sai District News: ఆర్టీసీ బస్సును హడలెత్తించిన మందుబాబు.. బస్సు కిందికి వెళ్లి.. ఏం చేశాడంటే?

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?