Miss World Contest in Hyderabad: తెలంగాణ సంస్కృతిని ప్రపంచ నలుమూలల చాటేందుకు సిద్ధమవుతుంది. మిస్ వరల్డ్ పోటీలకు వేదిక అవుతుంది. ఇమేజ్ ను ప్రపంచానికి చాటేందుకు సన్నద్ధమవుతోంది. అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. హైదరాబాద్ ప్రపంచానికి తెలిసినా తెలంగాణ ఘనతను సైతం, ప్రపంచంలోని ప్రజల దృష్టినిమరల్చేందుకు ప్రపంచ సుందరీ పోటీలు నిర్వహించబోతుంది. ఈ పోటీలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ఆమాంతం పెంచబోతుంది. అందుకు తెలంగాణలోని 20 టూరిజం ప్రాంతాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. అందుకు వారసత్వ కట్టడాలను సైతం ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసింది. మరోవైపు టూరిజం అభివృద్ధికి ఈ పోటీలు దోహదపడేలా ప్రణాళికలు రూపొందిస్తుంది.
తెలంగాణలోగానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిస్ వరల్డ్ పోటీలు ఇప్పటివరకు నిర్వహించలేదు. కేవలం ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ పోటీలను నిర్వహించి ప్రపంచానికి ఆ ప్రాంత ఖ్యాతిని చాటిచెబుతారు. ఇప్పటివరకు దేశంలో మిస్ వరల్డ్ పోటీలు బెంగుళూరు, ముంబాయిలో మాత్రమే నిర్వహించారు. మొదటిసారి తెలంగాణలో నిర్వహించబోతున్నారు. అందుకు హైదరాబాద్ వేదిక కాబోతుంది. ఈ పోటీలు దేశంలో మూడోసారి నిర్వహించడం. అందుకు తెలంగాణ బ్రాండ్ ఈమేజీని దశదిశలా చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది.
మిస్ వర్డల్ పోటీలను తెలంగాణ పర్యాటక శాఖ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంతోపాటు రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు మిస్ వర్డల్ పోటీలను అవకాశంగా మలుచుకోనున్నది. అందుకు పోటీల నిర్వహణ కోసం తేదీని ఫిక్స్ చేశారు. మే 7 నుంచి 31 వతేదీ వరకు మిస్ వర్డల్ పోటీలను రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు. గచ్చిబౌలిలో మే7న సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.
31న హైటెక్స్ లో ముగింపు కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ పోటీల్లో 140 దేశాలకు చెందిన మిస్ లు పాల్గొననున్నారు. వీరితో పాటు ఆయా దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు, ఆయాదేశాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిసింది. వారికి వసతుల కల్పనకు ముందస్తుగా టూరిజం శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
20 టూరిజం ప్రాంతాల్లో పోటీలు
రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో పోటీలు, కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించేందుకు టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ పోటీల్లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈవెంట్స్ నిర్వహించబోతున్నట్లు శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, పోచంపల్లి, రామప్ప, యాదగిరి గుట్ట, అనంతగిరి, బుద్ధవనం, ఎక్స్పీరియం, వెయ్యి స్తంభాల గుడి, అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, వేములవాడ, భద్రాచలం, జోగులాంబ, పోచంపల్లి చీరెలు, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, రామప్ప ఆలయం, కాకతీయుల చరిత్ర, మేడారం వనదేవతలు సమ్మక్క-సారక్క ప్రాశస్త్యం, లక్నవరం సరస్సు, బుద్ధవనం, నాగార్జునసాగర్ కొండ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామం వద్ద ఉన్న దేశంలోనే రెండో అతిపెద్ద బౌద్ధ స్థూపాన్ని వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటలకు చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో విశ్వవిజేతకు 1 మిలియన్ డాలర్లు ఫ్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు సమాచారం.
పర్యాటకానికి మరింత ఊతం
మిస్ వర్డల్ పోటీలకు టూరిజంకు భారీగా ప్రమోషన్ జరగనున్నది. ఈ పోటీలతో మెడికల్ టూరిజం, మౌలిక సదుపాయాలు, భద్రత, విదేశాలతో అనుసంధానంపై హైదరాబాద్ లో ఉన్న వసతులు, వనరులు, ఇతర సౌకర్యాలు, చేనేత, ఇతర చేతి వృత్తులు, సంప్రదాయ కళలు, హస్తకళలు అంతర్జాతీయ వేదికపై ప్రాచుర్యం లభించనున్నది. దీనికోసం రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాలకు చెందిన డాక్యుమెంటరీని కూడా తయారు చేసి ఈ పోటీల్లో ప్రదర్శించబోతున్నారు. అంతేగాకుండా రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో సైతం ఈ పోటీలను నిర్వహించడంతో తెలంగాణలోని ప్రత్యేకతలు, సంస్కృతి, సంప్రదాయాలు సైతం ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. మరోవైపు కల్చరల్ ఈవెంట్స్ తోనూ అన్ని దేశాలకు తెలంగాణ ఖ్యాతిని చాటేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజంపై దృష్టి సారించిన నేపథ్యంలో విదేశీ పర్యటకులను మరింతగా ఆకర్షించే అవకాశం ఉందని, ఒకసారి ప్రపంచానికి తెలంగణ కల్చర్ చూపితే భవిష్యత్ లో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భావిస్తున్నారు. అందుకే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను వరల్డ్ వ్యాప్తంగా పెంచడమే లక్ష్యం. అందుకే మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించబోతున్నారు. వందలకోట్లు పెట్టిన ప్రచారం రాదు. కేవలం తక్కువ ఖర్చుతో ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని, ఖ్యాతిని చాటబోతున్నాం. రాష్ట్రంలోని 20 టూరిజం ప్రాంతాల్లో కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వారసత్వ కట్టడాలను ప్రపంచానికి తెలియజేసి విదేశీ పర్యటకులను ఆకర్షించనున్నాం. ఈ పోటీల్లో 140 దేశాలు పాల్గొనబోతున్నాయి.
Also read: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!