Telangana Distinctive Painter Dasi Sudarshan Passes Away
Cinema

Dasi : గుండెపోటుతో విలక్షణ చిత్రకారుడు దాసి కన్నుమూత

Telangana Distinctive Painter Dasi Sudarshan Passes Away: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో వరుస మరణాలతో తీరని విషాదఛాయలు అలుముకుంటున్నాయి. గతరాత్రి ప్రముఖ అనువాద రచయిత రామకృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనను మరువకముందే తాజాగా మరొకరు మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. ప్రముఖ చిత్రకారుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ అలియాస్ దాసి సుదర్శన్ (72) కన్నుమూశారు.

మిర్యాలగూడలోని తన స్వగృహంలో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పిట్టంపల్లి సుదర్శన్ .. ప్రభుత్వ కాలేజీలో ఒక డ్రాయింగ్ టీచర్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ఆ తరువాత కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా మారారు. నర్సింగరావు దర్శకత్వంలో 1988లో విడుదలైన దాసి సినిమాకు ఆయనకు జాతీయ అవార్డును అందుకున్నారు.

Read Also: డ్యాన్స్‌ ఇరగదీసిన రాజమౌళి, వైరల్‌ అవుతున్న వీడియో

అప్పట్టో ప్రజాధారణ పొందిన ఈ మూవీకి ఊహించని స్థాయిలో ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. కేవలం చిత్రకారుడు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గానే కాకుండా రచయితగా, కార్టునిస్ట్‌గా కూడా పనిచేశారు. అంతేకాకుండా జాతీయ అవార్డు జ్యూరీలోనూ సభ్యుడిగా పనిచేశారు. ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ కవులు, కళాకారులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం మిర్యాలగూడలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తన కుటుంబసభ్యులు తెలిపారు.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ