North Korea
అంతర్జాతీయం

North Korea:’మమ్మల్ని రెచ్చగొట్టొద్దు’.. ట్రంప్ కు ఉ.కొరియా స్ట్రాంగ్ వార్నింగ్

North Korea: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నారు. టారిఫ్ లు, ఆంక్షలు పేరుతో మిత్ర దేశాలను సైతం బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియాపైనా ట్రంప్ కవ్వింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ దేశం ఘాటుగా బదులిచ్చింది. నియంత కిమ్ (Kim Jong Un) సోదరి కిమ్ యో జోంగ్ (Kim Yo Jong).. అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ జోలికొస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.

అమెరికా ఏం చేసిందంటే?

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య నిత్యం యుద్ధ వాతావరణం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ కొరియాతో కలిసి అమెరికా పలుమార్లు సైనిక విన్యాసాలు సైతం నిర్వహించింది. తద్వారా బైడెన్ హయాంలో ఉ.కొరియాను కవ్వింపులకు గురి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఏర్పడ్డ ట్రంప్ ప్రభుత్వం సైతం ఉ.కొరియాను రెచ్చగొట్టే చర్యలకు దిగింది. ద.కొరియాలోని బుసాన్ పోర్ట్ లో అమెరికా తన విమాన వాహక నౌకను మోహరించింది. ఈ ఘటన ఉ.కొరియాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

కిమ్ సోదరి హెచ్చరిక

తమ శత్రుదేశంలో అమెరికా తన విమాన వాహక నౌకను నిలిపి ఉంచడాన్ని ఉత్తర కొరియా నియంత కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) తీవ్రంగా తప్పుబట్టింది. గతంలో బైడెన్ ప్రభుత్వం అవలంభించిన శత్రుత్వ వైఖరినే ప్రస్తుత ట్రంప్ సర్కార్ కూడా అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ఉ.కొరియాను రాజకీయంగా, సైనికంగా రెచ్చగొట్టే చర్యలను అగ్రరాజ్యం తీవ్రతరం చేసినట్లు ఆమె మండిపడింది. ఈ చర్యలు ఇరుదేశాల మధ్య మరింత ఘర్షణలను రాజేస్తున్నట్లు పేర్కొంది. అమెరికా ఇదే వైఖరిని అవలంభిస్తే దీటుగా బదులిస్తామని కిమ్ సోదరి హెచ్చరించింది.

Also Read: USA: ట్రంప్ తో జెలెన్ స్కీ వాగ్వాదం.. భారీ మూల్యం చెల్లించుకున్న ఉక్రెయిన్

గత నెలలోనూ కవ్వింపులు

గత నెల ఫిబ్రవరిలో ప్రస్తుతం విమాన వాహక నౌకను మోహరించిన తీరంలోనే అమెరికా తన అణ్వాయుధ జలాంతర్గామిని నిలిపింది. దీనిని అప్పట్లో ఉ.కొరియా చాలా తీవ్ర స్వరంతో ఖండించింది. అమెరికా ఉన్మాదానికి ఇది పరాకాష్ట అంటూ ఉ.కొరియా రక్షణ శాఖ బహిరంగ లేఖను విడుదల చేసింది. అమెరికా చర్యలతో కొరియా ద్వీపకల్పంలో తీవ్రమైన సైనిక ఘర్షణలు ఏర్పడవచ్చని రాసుకొచ్చింది. కవ్వించేవారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఉ.కొరియా వార్నింగ్ పై ట్రంప్ ప్రభుత్వం  గతంలో స్పందించలేదు. ఈసారైనా కిమ్ సోదరి వ్యాఖ్యలపై స్పందిస్తారేమో చూడాలి.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!