USA
అంతర్జాతీయం

USA: ట్రంప్ తో జెలెన్ స్కీ వాగ్వాదం.. భారీ మూల్యం చెల్లించుకున్న ఉక్రెయిన్

USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఇటీవల ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ (Volodymyr Zelenskyy) మీడియా ముఖంగా మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఇరుదేశాధినేతలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఓ దశలో ‘స్టుపిడ్ ప్రెసిడెంట్’ అంటూ జెలెన్ స్కీపై ట్రంప్ విరుచుకుపడ్డారు. దీంతో ఉక్రెయిన్ పై ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందోనన్న సందేహాం ప్రపంచ దేశాల్లో మెుదలైంది. ఈ క్రమంలోనే సోమవారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేసిన జెలెన్ స్కీ.. అమెరికాకు మరోమారు స్నేహ హస్తాన్ని అందించారు. దీంతో ట్రంప్ కోపం కాస్త అయినా చల్లారి ఉంటుందని అంతా భావించారు. అయితే తాజాగా ఉక్రెయిన్ కు అమెరికా గట్టి షాకిచ్చింది.

మిలటరీ సాయం నిలిపివేత

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ కు ఇంతకాలం అండగా ఉంటూ వచ్చిన అమెరికా తాజాగా చేతులెత్తేసింది. కీవ్ కు అందిస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ కు చెందిన ఓ అధికారి ధ్రువీకరించారు. ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు అధ్యక్షుడు ట్రంప్ కృషి చేస్తున్నారన్న ఆయన తమ భాగస్వామ్యులు సైతం ఇందుకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతవారం జరిగిన భేటిలో ఆ దిశగా అడుగులు పడకపోవడంతో అమెరికా తన మిలటరీ సాయాన్ని ఉపసంహరించుకున్నట్లు పరోక్షంగా తెలియజేశారు. అయితే సైనిక సాయం నిలిపివేత తాత్కాలికమేనని శ్వేతసౌధం అధికారి స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ పై ఒత్తిడి తెచ్చేందుకే

రష్యాతో యుద్ధం మెుదలైన తొలి రోజు నుంచి ఉక్రెయిన్ కు అమెరికా అండగా నిలిచింది. బైడెన్ హయాంలో పెద్ద ఎత్తున ఆర్థిక సాయంతో పాటు మిలటరీ సామాగ్రి, ఆయుధాలు సమకూర్చింది. అయితే ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్ విషయంలో అగ్రరాజ్యం వైఖరి పూర్తిగా మారిపోయింది. అధ్యక్ష పీఠం ఎక్కిన తొలిరోజు నుంచే రష్యాతో యుద్ధం ఆపేయాలని ట్రంప్ బహిరంగంగానే ఉక్రెయిన్ కు సూచిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే శాంతిస్థాపన కోసం గతవారం భేటి కూడా అయ్యారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇందుకు ససేమిరా అనడంతో ఈ సమావేశం అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో యుద్ధం ఆపేలా కీవ్ పై (Ukraine) ఒత్తిడి తెచ్చేందుకే శ్వేతసౌధం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భేటిలోనే హెచ్చరించిన ట్రంప్

సాధారణంగా ఏ దేశాధినేతలు భేటి అయినా ఆ సమావేశం చాలా హుందాగా ఉంటుంది. ఇటీవల ట్రంప్ – జెలెన్ స్కీ భేటి ఇందుకు పూర్తి భిన్నం. ఒకరిపై ఒకరు మీడియా ముఖంగానే గట్టిగా అరుచుకున్నారు. రష్యాతో శాంతి చర్చలతో పాటు ఉక్రెయిన్ లోని ఖనిజాలను తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలని జెలెన్ స్కీకి ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో తమపై రష్యా దాడి చేయదన్న గ్యారంటీ మీరు ఇస్తారా? అంటూ జెలెన్ స్కీ సూటిగా ప్రశ్నించారు. దీంతో ట్రంప్ కు కోపం చిర్రెత్తుక్కొచ్చింది. మినరల్ డీల్ పై సంతకం చేయకుంటే తాము తప్పుకుంటామని ఆరోజే తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగానే తాజాగా మిలటరీ సాయాన్ని ఎత్తివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు