Minister Vakiti Srihari: ప్రతి ఒక్కరూ విద్యావంతులు అయినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్(Young India Integrated School) ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణ కేంద్రంలోని గొల్లపల్లి గ్రామ సమీపంలో 25 ఎకరాలలో చేపట్టబోతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి టెంకాయ కొట్టి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
2500 మంది విద్యార్థులు
గొల పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అత్యాధునికమైన వసతులతో 2500 మంది విద్యార్థులు కార్పోరేట్ బోధన, వసతులతో పాఠశాల నిర్మితమౌతుంది, రాష్ట్రంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న మఖ్తల్ నియోజకవర్గం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని విధాలుగా వెనుకబడింది. ఈ ప్రాంత ప్రజలు అక్షరాస్యత లేకపోవడం వల్లనే అభివృద్ధిలో వెనుకబడ్డామని రాబోయే తరాన్ని విద్యావంతులను చేస్తేనే అభివృద్ధి సాధ్యమని గుర్తించి ఇక్కడ పుట్టిన ప్రతి బాల బాలికలు అన్ని వసతులతో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిచారన్నారు.
Also Read: Srinath Maganti: హిట్ సినిమా సీక్వెల్‌లో ఛాన్స్ కొట్టేసిన శ్రీనాథ్ మాగంటి.. ఎలా వచ్చిందంటే?
దాదాపు రెండు వందల యాభై కోట్లు
భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తే నిధులు మంజూరు చేస్తా అనడంతో ఆగమేగాల మీద మంత్రి వాకిటి శ్రీహరి స్థానిక తాసిల్దార్ సతీష్ కుమార్(MRO Sathish Kumar) కు దాదాపు 20 ఎకరాల భూమిని సేకరించాలని ఆదేశించడంతో మూడు నెలల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూలుకు కావలసిన భూమిని సర్వే చేసి ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి కావలసిన దాదాపు రెండు వందల యాభై కోట్లను మంజూరు చేయడంతో ఆదివారం రోజు సర్పంచ్ సూర్య కుమార్ ఆధ్వర్యంలో మంత్రి భూమి పూజ చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించి వీలైనంత త్వరలోనే భవాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు మంత్రి మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

