Yellampet Municipality: రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోఎల్లంపేట మున్సిపాలిటీ ఎన్నికలు రాజకీయంగా హోరాహోరీ స్థాయికి చేరాయి. కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS) పార్టీల మధ్య నేరుగా సమరం సాగుతుండగా, బీజేపీ(BJP) మాత్రం ఈ పోటీలో పూర్తిగా వెనుకబడ్డట్టుగా కనిపిస్తోంది. వార్డు స్థాయి ప్రచారం నుంచి నాయకుల సమావేశాల వరకు కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌లు దూకుడు పెంచగా, బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.
గెలుపుపై ధీమా వ్యక్తం
అధికార పార్టీ కాంగ్రెస్ మున్సిపాలిటీలో పూర్తి ఫోకస్ పెట్టింది. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్(Vajresh Yadav),మాజీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి(Harivardhan Reddy),మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(Sudeer Reddy) సంక్షేమ పథకాలు, అభివృద్ధి హామీలతో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. స్థానిక నేతలతో వరుస సమావేశాలు, వార్డు వారీ వ్యూహాలతో కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. “ప్రజలే మా బలం” అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) తనదైన శైలిలో బీఆర్‌ఎస్(BRS) పార్టీ కూడా తగ్గేదేలే అన్నట్టుగా ముందుకెళ్తోంది. గత పాలనలో చేసిన అభివృద్ధి పనులను ఎజెండాగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. క్యాడర్‌ను సమీకరించి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తోంది.
Also Read: KTR: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది.. కాంగ్రెస్ వైఫల్య పాలనపై కేటీఆర్ ఫైర్!
నేతల సమావేశాలు లేవు
బీఆర్‌ఎస్ నేతల దూకుడు వ్యాఖ్యలతో ఎల్లంపేట రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇదిలా ఉండగా, బీజేపీ పార్టికి సరైన నాయకత్వం లేక బిజెపి పరిస్థితి మాత్రం గందరగోళంగా మారింది. అన్ని వార్డుల్లో అభ్యర్థులున్నారా? ప్రచార వ్యూహం ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం పార్టీకి పెద్ద లోటుగా మారింది. కీలక నేతల సమావేశాలు లేవు. క్షేత్రస్థాయిలో క్యాడర్ కదలిక లేదు. దీంతో “ఎల్లంపేట ఎన్నికల్లో బీజేపీ పోటీలో ఉందా?” అన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి ఎల్లంపేట మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్–బీఆర్‌ఎస్ మధ్య ద్వైపాక్షిక సమరంగా మారాయి. బీజేపీ ఇప్పటికైనా దూకుడు పెంచకపోతే, ఈ ఎన్నికల్లో రాజకీయంగా పూర్తిగా వెనుకపడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: Harish Rao: నల్లమల సాగర్ కు సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నీళ్ల శాఖ మంత్రిపై హరీష్ రావు ఫైర్!

