KTR: పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, బయట కాంగ్రెస్ (Congress) అని చెప్పుకుంటూ స్పీకర్ దగ్గర మాత్రం బీఆర్‌ఎస్ (Brs) అని అంటున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్ గౌడ్ అనుచరులతో కలిసి పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చూసి కాంగ్రెస్‌లో చేరారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ ‘వే’ను రద్దు చేసినందుకే సర్కార్‌తో చేతులు కలిపారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read: KTR on CM Revanth: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. గుండె ఆగి చస్తావ్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
24 నెలలుగా మోసం చేస్తోంది
రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, రెండు లక్షల ఉద్యోగాలంటూ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను గత 24 నెలలుగా మోసం చేస్తోందని మాజీ మంత్రి మండిపడ్డారు. నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తూతూ మంత్రంగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌పై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కనిపిస్తేనే ప్రజలకు ధైర్యం వస్తుందని, కాంగ్రెస్ వైఫల్య పాలనలో వ్యాపారాలు దెబ్బతిని ఉపాధి కరువైందని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరెంటు కోతలు, తాగునీటి తిప్పలు లేకుండా నగరాన్ని అభివృద్ధి చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read: KTR: క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప.. ప్రజల జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్

