Huzuraba: మారుతున్న జీవనశైలి కారణంగా డయాబెటిస్ (మధుమేహం) కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలని జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి (Dy. DM&HO) డాక్టర్ చందు ప్రజలకు సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని, నాడు హుజూరాబాద్‌లోని ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మధుమేహం నివారణ మార్గాలు, నియంత్రణపై ఈ ర్యాలీలో ప్రజలకు చైతన్యం కల్పించారు.
Aslo Read: Huzurabad: జాతీయస్థాయి కరాటే పోటీల్లో.. హుజూరాబాద్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన!
ఉచిత వైద్య సేవలు
అధికారుల భాగస్వామ్యం Dy. DM&HO డాక్టర్ చందు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మెడికల్ ఆఫీసర్ తులసి దాస్‌తో పాటు ఆరోగ్య సిబ్బంది ఈ ర్యాలీని ప్రారంభించి, పట్టణ ప్రధాన కూడళ్ల గుండా నడిపించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోండి” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రజల దృష్టిని ఆకర్షించాయి.
ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిం
ర్యాలీ అనంతరం జరిగిన సదస్సులో డాక్టర్ చందు మాట్లాడుతూ, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా తీవ్ర ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా లభించే పరీక్షలు, మందులు మరియు నిపుణుల సలహాలను ప్రజలు వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించేందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జరీనా, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
Aslo Read: Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
